Begin typing your search above and press return to search.

జాకీ లో కొత్త టాలెంట్ చూడండి

By:  Tupaki Desk   |   20 Feb 2018 10:31 AM IST
జాకీ లో కొత్త టాలెంట్ చూడండి
X
డాక్టర్ ని అవ్వబోయి యాక్టర్ ని అయ్యాం అంటూ ఉంటారు కొంతమంది. మరి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మాత్రం ఏం అవ్వబోయి యాక్టర్ అయిందో కానీ అన్నీ కళల్లోనూ తన ప్రతిభను చాటి చెప్పేస్తోంది. జాక్వెలిన్ తన లోని ఆర్టిస్ట్ ని ఈమధ్యనే బయటకు తెచ్చింది.

నాలుగు గంటలు కష్టపడి వేసిన మొదటి చిత్రం అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. "బ్యాంకాక్ లో రేస్ 3 సినిమా షూటింగ్ మధ్య దొరికిన గ్యాప్ లో గీసిన నా మొట్ట మొదటి పోట్రెయిట్ చిత్రం" అంటూ పోస్ట్ పెట్టి ఓపికగల టీచర్ గా ఉన్నందుకు నిలేష్ వేడె కు - నాలుగు గంటలు కూర్చుని తనకు సహకరించినందుకు జగ్గీ కి చాలా థాంక్స్ అని చెప్పింది. ఆ ఫోటోలు చూసిన అందరూ ఇంత అందమైన నటీమణి ఇంత గొప్పగా బొమ్మలు కూడా వెయ్యగలదా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ బొమ్మ నిజంగానే అచ్చు ఆ వ్యక్తి లాగానే ఉండటం చూసి ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసిందేమో అనుకోవచ్చు కానీ ఇదే తను వేసినా మొదటి చిత్రం అంటే నమ్మగలమా? కానీ నమ్మక తప్పదు.

అటు నటన అయినా, పోల్ డాన్స్ అయినా, అందంతో అయినా, ఇటు బొమ్మలు వెయ్యడంలో అయినా తనకు తానే సాటి లేరు ఎవరు పోటీ అని నిరూపించుకుంటోంది జాకీ. ఎంతైనా ఈ శ్రీలంకన్ భామ నిజంగానే అల్రౌండర్ అండోయ్..