Begin typing your search above and press return to search.

గోల్డెన్ అందాలు భలే ఉన్నాయిలే

By:  Tupaki Desk   |   26 May 2018 12:45 PM IST
గోల్డెన్ అందాలు భలే ఉన్నాయిలే
X
హాట్ శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారత్ లో బాగానే సెట్టయ్యింది. చూస్తుండగానే చిన్న చిన్న పాత్రల నుంచి బడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం లోకల్ భామలకు పోటీని ఈ బ్యూటీ గట్టిగా ఇస్తోంది. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా తన టాలెంట్ తో అవకాశాలను అందుకుంటూ వెళుతోంది. ఇక జాక్వెలిన్ అప్పుడపుఁడు డిఫెరెంట్ స్టైల్ లో ఇచ్చే ఫొటో షూట్స్ కూడా బాగా వైరల్ అవుతుంటాయి.

గతంలో చాల రకాలుగా తన సొగసులను చాలా డిఫెరెంట్ గా ప్రజెంట్ చేసింది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఓ స్టిల్ కూడా అందరిని ఆకట్టుకుంటోంది. డ్ర్రోలిసియస్ అనే డ్రెస్ లో కనిపించి చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. గోల్డ్ కలర్ డ్రెస్ లో ఆమె అందాలు కలిసిపోయాయి అని ప్రశంసలు అందుతున్నాయి. జాక్వెలిన్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ లెగ్స్ అందాలతో సరికొత్త కిక్ ఇచ్చిందని నెటిజన్స్ ట్యాగ్స్ ఇచ్చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం జాక్వెలిన్ రేస్ 3 లాంటి భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. సల్మాన్ ఖాన్ - అనిల్ కపూర్ అలాగే సన్నీ డియోల్ లాంటి స్టార్ నటీనటులు సినిమాలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 100 కోట్లతో నిర్మించిన ఆ సినిమా జూన్ 15న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.