Begin typing your search above and press return to search.

జాకీ కాదు బ్రాండ్ న్యూ మ‌హారాణి

By:  Tupaki Desk   |   30 Dec 2019 11:00 PM IST
జాకీ కాదు బ్రాండ్ న్యూ మ‌హారాణి
X
ఆత్మ హ‌త్య చేసుకునేంత డిప్రెష‌న్ లోకి వెళ్లిన భామ‌ల జాబితాలో జాక్విలిన్ పేరు కూడా ఉంది. కింగ్ ఫిష‌ర్ మోడ‌ల్ గా బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మై అటుపై కెరీర్ డైల‌మాలో ఒకానొక ద‌శ‌లో తీవ్ర ఒత్తిడిలో ప‌డిపోయింది. అటుపై ఆ డిప్రెష‌న్ వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంది. స‌రిగ్గా అలాంటి మూవ్ మెంట్ లో స‌ల్మాన్ భాయ్ ఈ అమ్మ‌డికి లిఫ్టిచ్చాడు. కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్- అందాల జాక్విలిన్ జంట‌గా న‌టించిన కిక్ చిత్రం ఎంత‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యిందో తెలిసిందే. ఆ త‌ర్వాత జాకీ కెరీర్ తిరిగి చూసుకోవాల్సిన ప‌నే లేకుండా ప‌రిగెత్తింది.

ఇటీవ‌లే ఈ భామ టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో చిత్రంలో అదిరిపోయే స్పెష‌ల్ నంబ‌ర్ తో అంతే హాట్ గా రంగ ప్ర‌వేశం చేసింది. బ్యాడ్ బోయ్ సాంగ్ లో జాకీ ఒంపుసొంపుల ఖిల్లా కుర్రాళ్ల‌కు కంటిపై కునుకుప‌ట్ట‌నీకుండా చేసింది. ఇక జాకీ నిరంత‌రం అంత‌కుమించి సోష‌ల్ మీడియాల్లో విరుచుకుప‌డుతుంటుంది.

ఇక్క‌డ రెగ్యుల‌ర్ జిమ్మింగ్ యోగా ఫోటోషూట్ల‌తో పాటు నిరంత‌ర అప్ డేట్స్ ఇస్తుంటుంది. తాజాగా ఓ కొత్త లుక్ ని జాకీ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో బ్రాండ్ న్యూ మ‌హారాణిలా అల్ట్రా మోడ్ర‌న్ లుక్ లో క‌నిపించింది. ఊదా రంగు లాంగ్ ఫ్రాకులో జాకీ అందాల్ని ఏమ‌ని వ‌ర్ణించాలి? మొన్న‌టికి మొన్న ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ కేటీ పెర్రీనే డామినేట్ చేస్తూ జాకీ ఇచ్చిన ట్రీట్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మ‌రోసారి ఈ హాట్ ఫోజుతో అంతే వైర‌ల్ అవుతోంది మ‌రి. ఇక జాకీ కెరీర్ ని ప‌రిశీలిస్తే సాహో స్పెష‌ల్ నంబ‌ర్ త‌ర్వాత వేరొక బాలీవుడ్ మూవీకి క‌మిటైన‌ట్టు లేదు. నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ డ్రైవ్ లో న‌టించింది.