Begin typing your search above and press return to search.

బ్యాడ్ గాళ్ ఏంటీ ఇలా బుక్క‌యిపోయింది?

By:  Tupaki Desk   |   12 Dec 2021 5:00 PM IST
బ్యాడ్ గాళ్ ఏంటీ ఇలా బుక్క‌యిపోయింది?
X
బాలీవుడ్ బ్యాడ్ గాళ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మ‌నీలాండ‌రింగ్ వివాదంలో నిండా కూరుకుపోయిన సంగ‌తి తెలిసిందే. న్యూఢిల్లీలోని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు విచార‌ణ‌కు డిసెంబర్ 9న ఎటెండ‌య్యింది. వరుసగా రెండవ రోజు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కు పాల్పడిన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తో పాటు మరికొందరితో క‌లిసి జాకీ విచార‌ణ‌కు హాజ‌రైంది. ఇప్పుడు డిసెంబర్ 11న అదే కేసులో విచారణ కోసం ED ముందు మళ్లీ హాజరయ్యార‌ని గుస‌గుస వినిపిస్తోంది.

కాన్ మెన్ సుకేష్ చంద్రశేఖర్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ని మళ్లీ ఈడీ ప్రశ్నించార‌ని స‌మాచారం. తాజా నివేదికల ప్రకారం డిసెంబరు 8న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సుమారు ఎనిమిది గంటలపాటు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది ఈడీ. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద పలు సెషన్ లలో ఆమె వాంగ్మూలాల్ని నమోదు చేసారు. డిసెంబర్ 9న కూడా విచారణ కొనసాగింది. గత కొన్ని నెలలుగా.. జాకీ స్టేట్ మెంట్ లను రికార్డ్ చేయడానికి కూడా ఇప్ప‌టికే ఆమెను పిలిచారు.

``జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి ED పిలుస్తోంది. ఆమె తన స్టేట్ మెంట్ లను సక్రమంగా నమోదు చేసింది. భవిష్యత్తులో కూడా దర్యాప్తులో ఏజెన్సీకి పూర్తిగా సహకరిస్తుంది. ప్రమేయం ఉన్న జంటతో సంబంధం గురించి చేసిన అపవాదు ప్రకటనలను కూడా జాక్వెలిన్ నిర్ధ్వంద్వంగా ఖండించింది`` అని జాక్విలిన్ ప్ర‌తినిధులు తెలిపారు.

డిసెంబర్ 5 న జాకీ ముంబై విమానాశ్రయం గుండా ప్రయాణించకుండా అధికారులు ఆపేసిన సంగ‌తి విధితమే. సల్మాన్ ఖాన్ ద‌-బాంగ్ టూర్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భాగం కావాల్సి ఉంది. అయితే స్కామ్ లో సాక్షిగా ఉన్నందున ఆమెను దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించలేదు. 200 కోట్ల మనీలాండరింగ్ కేసును ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. వెలుగులోకి వచ్చిన కొత్త సాక్ష్యాల ప్ర‌కారం.. ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ తో సంబంధాలను ఈడీ పూర్తిగా ఆరా తీసింది. ప‌రిశోధ‌న కోసం జాక్వెలిన్ ను డిసెంబరు 8న ఢిల్లీలోని ED విచారణకు పిలిచింది. కొనసాగుతున్న విచారణ కారణంగా జాక్వెలిన్ ద‌బాంగ్ టూర్ నుండి తప్పుకున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఒకానొక ద‌శ‌లో ఈ టూర్ కి జాకీ వెళుతోంద‌ని అందుకు ఈడీ అనుమ‌తించింద‌ని కూడా వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. జాక్విలిన్ ఇప్ప‌టికే తెలుగు ఆడియెన్ కి బ్యాడ్ గాళ్ గా సుపరిచితం. ప్ర‌భాస్ సాహోలో బ్యాడ్ బోయ్ సాంగ్ తో పాపుల‌రైంది. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌రి హ‌ర‌వీర‌మ‌ల్లులో న‌టిస్తోంది. కొన‌సాగుతున్న వివాదం వ‌ల్ల జాకీని మూవీ నుంచి తొల‌గించార‌ని గుస‌గుస‌లు వినిపించాయి.