Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: విండోస్ రవికలో అందాల విందు

By:  Tupaki Desk   |   13 Aug 2016 11:00 PM IST
ఫోటో స్టోరి: విండోస్ రవికలో అందాల విందు
X
శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో రచ్చ రచ్చ చేసి పారేస్తోంది. వరుసగా సినిమాలు రిలీజ్ చేసేస్తూ స్పీడ్ చూపించేస్తోంది. ఈ భామ రేంజ్ లో హిందీ భామలు కూడా వేగంగా మూవీస్ రిలీజ్ చేయలేకపోతున్నారు. జూన్ నెలలో హౌస్ ఫుల్ 3 తో భారీ హిట్ నే కొట్టిన జాక్వెలిన్.. జూలై నెలాఖరులో డిషూ అంటూ ప్రేక్షుకుల గుండెలు పేల్చేసింది. ఈ రెండు చిత్రాలు వంద కోట్లకు మించిన కలెక్షన్స్ సాధించి అమ్మడికి బోలెడంత సంతోషాన్ని పంచేశాయి.

తను సంతోషంగా ఉంటే సరిపోతుందా.. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకోకపోతే ఎలా అనుకున్న జాక్వెలిన్.. అందుకోసం ప్రత్యేకమైన అందాల విందు ఏర్పాటు చేసింది. వీపంతా చూపిస్తూ చీరకట్టుతో మెరిసిన జాకీ.. స్పెషల్ గా డిజైన్ చేసిన జాకెట్ తో మెరిసిపోయింది. డిజైనర్ వేర్ కాబట్టి.. ఏదో డిజైన్ ఉంది కానీ.. వాస్తవానికి ఇది బ్యాక్ లెస్ చోళీ అనాల్సిందే. అమ్మడి జాకెట్ కి అన్ని విండోస్ ఉన్నాయ్ మరి. వెనక నుంచి చూస్తేనే ఇంతగా మత్తెక్కిస్తే.. ఇక జాకీ అందాలను ముందు నుంచి చూస్తే ఫ్యాన్స్ తట్టుకోగలరా అనిపిస్తోంది.

జూన్ జూలైల్లో రెండు సినిమాలతో స్పీడ్ చూపించిన జాక్వెలిన్.. ఆగస్ట్ 25న మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకులను పలకరించనుంది. టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించిన ఏ ఫ్లైయింగ్ జాట్ రిలీజ్ సందర్భంగా.. ఇప్పటికే ప్రచారాలు కూడా మొదలుపెట్టేసింది. ఆఫ్ స్క్రీన్ లోను.. ఫోటో షూట్స్ లోనే ఇంతగా రెచ్చిపోతే.. ఇక రాబోయే సినిమాల్లో జాక్వెలిన్ వడ్డించే విందును తృప్తిగా ఆరగించేయచ్చని ఫ్యాన్స్ బోలెడన్ని హోప్స్ పెట్టేసుకున్నారు.