Begin typing your search above and press return to search.

కొత్త జెంటిల్ మేన్.. సెక్సీ గాళ్‌ ఫ్రెండ్

By:  Tupaki Desk   |   6 Jun 2017 1:39 PM IST
కొత్త జెంటిల్ మేన్.. సెక్సీ గాళ్‌ ఫ్రెండ్
X
జెంటిల్ మేన్ టైటిల్ వినగానే రెండు దశాబ్దాల క్రితం డైరెక్టర్ శంకర్ హీరో అర్జున్ తో తీసిన సినిమా కళ్ల ముందు కదలాడుతుంది. నాటితరం అభిమానులకే కాదు.. నేటి తరం అభిమానులకూ ఆ సినిమా నచ్చుతుంది. లాస్ట్ ఇయర్ హీరో నానితో ఇంద్రగంటి మోహనకృష్ణ జెంటిల్ మేన్ టైటిల్ పెట్టి సినిమా తీశాడు. ఈ సినిమా కూడా హిట్ కొట్టింది. ఈ రెండూ కాక ఇప్పుడు ఇంకో జెంటిల్ మేన్ వస్తున్నాడు.

తెలుగు అండ్ తమిళ జెంటిల్మన్ లు పూర్తయ్యాక ఇప్పుడు హిందీలో కొత్త జెంటిల్ మ్యాన్ వస్తున్నాడు. సిద్ధార్ధ కపూర్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ జంటగా ‘ఎ జెంటిల్ మేన్’ పేరిట ఈ సినిమా తెరకెక్కుతోంది. పూర్తిస్థాయి యాక్షన్ బేస్డ్ గా దీనిని తెలుగు దర్శక ద్వయం రాజ్ అండ్ డికె తెరకెక్కిస్తున్నారు. ఎ జంటిల్ మేన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను చూస్తే.. గౌరవ్ పాత్రలో నటిస్తున్న సిద్ధార్ధ స్టైలిష్ గెటప్ లో ఓ చేతిలో గన్ పట్టుకుని నుంచుంటే మరో చేతిలో ప్రెషర్ కుక్కర్ మూత పట్టుకుని నుంచుని ఉంటాడు. ఇది చూడటానికి భలే ఇంట్రస్టింగ్ గా ఉంది. సెకండ్ పోస్టర్ లో హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ను ప్రమాదం నుంచి కాపాడుతూ ఎంతకైనా తెగించే ప్రయత్నంలో విలన్స్ వైపు గన్స్ గురిపెడుతూ కనిపించాడు. ఆ సీన్లో జాకీ కూడా యమా సెక్సీగా ఉందిలే. ఈ సినిమా క్యాప్షన్ కూడా సుందర్ సుశీల్ రిస్కీ అని పెట్టారు. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్లు ఉండటం ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది.

ముందు ఈ సినిమాకు రీలోడ్ అని పేరు పెడదామని భావించారు. ఇంతలో ఈ సినిమా హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా వచ్చిన బ్యాంగ్ బ్యాంగ్ సినిమాకు సీక్వెల్ అనే రూమర్స్ వచ్చాయి. దీంతో ఫిలిం మేకర్స్ మనసు మార్చుకుని ‘ఎ జెంటిల్ మేన్’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లకు రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/