Begin typing your search above and press return to search.
వేధింపులా? బాలీవుడ్ చాలా మంచిది
By: Tupaki Desk | 4 Nov 2017 7:12 PM ISTసినిమా ఇండస్ట్రీలో చాలా వరకు నటీమణులు లైంగిక వేధింపులకు గురవుతుంటారని ఇప్పటివరకు చాలా మంది ఆరోపణలు చేశారు. ఇది ఈ కాలం నాటిది కాదని ఎప్పటి నుంచో వస్తోందని వారికి లొంగకపోతే కెరీర్ క్లోజ్ అవ్వడం ఖాయమని సీనియర్ హీరోయిన్స్ చాలామంది పలు ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. ఎవ్వరైనా ఆ ముళ్ల బాటను దాటి తీరాల్సిందే అని చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు.
అయితే ఈ మద్యన హాలీవుడ్ లో ఓ నిర్మాత అసలు రంగు బయటపడటంతో అందరూ తాము కూడా లైంగిక వేధింపులకు గురయ్యామని తెలిపారు. బాలీవుడ్ - టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్ హీరోయిన్స్ కూడా అలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నామని తెలిపారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ అయితే ట్విట్టర్ లో వేధింపులను ఎదుర్కొన్నట్లు #meToo అంటూ అనేక ట్వీట్లు చేశారు. కానీ ఒక బ్యూటీ మాత్రం బాలీవుడ్ అలాంటిది కాదు అని అంటోంది.
శ్రీలంక నుంచి వచ్చి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానిస్తోన్న జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఈ విషయం గురించి తనదైన శైలిలో స్పందించింది. బాలీవుడ్ లో అలాంటివి జరుగుతాయి అని నేను చెప్పను. బాలీవుడ్ చాలా మంచి ఇండస్ట్రీ. కానీ కొందరి వల్ల ఆ చెడ్డ పేరు వస్తోంది. ఎంత మంది లైంగిక వేధింపులకు గురయ్యారో నాకు తెలియదు. నేను మాత్రం అలాంటి పరిణామాలను ఎప్పుడు ఎదుర్కోలేదు. అలాంటి వాతావరణం కూడా నాకు కనిపించలేదు. అందరు ఎంతో ఫ్రెండ్లిగా ఉంటారని చెప్పుకొచ్చింది ఈ శ్రీలంకన్ మోడల్.