Begin typing your search above and press return to search.

జాక్ పాట్ అంటే ర‌ష్మికనే అడ‌గాలి

By:  Tupaki Desk   |   26 April 2022 5:15 AM GMT
జాక్ పాట్ అంటే ర‌ష్మికనే అడ‌గాలి
X
కాఫీ విత్ క‌ర‌ణ్ షోకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఫిల్ట‌ర్ లేకుండా అన్ని ర‌హ‌స్యాల్ని ఈ వేదిక‌పై బ‌య‌ట‌పెట్టేస్తుంటారు స్టార్లు. ఇంత‌కుముందు రాజ‌మౌళి- ప్ర‌భాస్ - రానా వంటి ప్ర‌ముఖుల‌కు ఈ ఆఫ‌ర్ ద‌క్కింది. ఇప్పుడు అందాల క‌థానాయిక ర‌ష్మిక మంద‌న‌కు కూడా ఇలాంటి అరుదైన ఛాన్స్ ద‌క్కింది.

కాఫీ విత్ కరణ్ షో పాపులారిటీకి వివాదాలు కూడా ఒక కార‌ణం. చివరి సీజ‌న్ షో కొన్ని వివాదాల‌తో అట్టుడికించింది. ఇప్పుడు కొత్త సీజన్ మొద‌ల‌వుతోంది. బాలీవుడ్ నుంచి బ‌డా స్టార్లు ఈ కార్యక్రమంలో కనిపించనున్నారు.

మొదటి ఎపిసోడ్ లో బాలీవుడ్ నుండి న‌వ‌దంప‌తులు అలియా భ‌ట్- రణబీర్ కపూర్ లు పాల్గొంటారు. ఆ త‌ర్వాత రష్మిక కూడా ఈ షోలో అరంగేట్రం చేస్తుంది.

నేష‌న‌ల్ క్రష్ గా వెలిగిపోతున్న ర‌ష్మిక మంద‌న ల‌క్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. టాలీవుడ్ లో ఛ‌లో- గీత గోవిందం చిత్రాల‌తో హిట్లు అందుకుని వ‌రుస‌గా పాన్ ఇండియా స్టార్ల‌తో న‌టించేస్తోంది. పుష్ప‌తో ఒక రేంజు హిట్టందుకుంది.

ఇప్ప‌టికిప్పుడు బాలీవుడ్ క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. యానిమ‌ల్ చిత్రంలో ర‌ణ‌బీర్ లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న జాక్ పాట్ కొట్టేసింది ర‌ష్మిక‌. పాపుల‌ర్ వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీల‌తో మంత‌నాలు సాగిస్తోంద‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే ముంబైలో ఇల్లు కొనుక్కుని సెటిలైన ఈ బ్యూటీ మునుముందు కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో క‌నిపించాక మ‌రింత హాట్ ఫేవ‌రెట్ గా మారిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.