Begin typing your search above and press return to search.

కొడుకు డేటింగ్ గురించి అడిగితే స్టార్ హీరో ఏమన్నాడంటే?

By:  Tupaki Desk   |   22 Jun 2021 9:00 AM IST
కొడుకు డేటింగ్ గురించి అడిగితే స్టార్ హీరో ఏమన్నాడంటే?
X
బాలీవుడ్ లో ప్రేమలు.. రిలేషన్లు.. లివింగ్ టుగెదర్ లాంటివి చాలా ఓపెన్ గానే చర్చలు జరుగుతుంటాయి. ప్రేమ మైకంలో మునిగిపోయే నటీనటులు.. వారి డేటింగ్ యవ్వారాల్ని సీక్రెట్ గా ఉంచాలని.. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదన్నట్లుగా ఏమీ ఉండదు. ఆ మాటకు వస్తే.. ఇటీవల కాలంలో ఇండస్ట్రీలోకి వచ్చిన నటీనటులు తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారు. రిలేషన్ షిప్ లపై ఓపెన్ గానే మాట్లాడుతున్నారు.

బాలీవుడ్ లోని హాట్ జంటల్లో టైగర్ ష్రాప్.. దిశా పటాని అనుబంధం గురించి కథలు..కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. వారి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే.. వారిద్దరు తమ రిలేషన్ మీద ఇప్పటివరకు నోరు విప్పింది లేదు. ఇలాంటివేళ.. టైగర్ ష్రాప్ తండ్రి కమ్ స్టైలీష్ స్టార్ నటుడు జాకీ ష్రాప్ వినూత్నంగా రియాక్ట్ అయ్యారు.

కొడుకు రిలేషన్ గురించి మాట్లాడమంటే.. కాస్త కూల్ గా రియాక్టు అవుతూ.. అది అతగాడి పర్సనల్ విషయంగా తేల్చేశారు. పాతికేళ్ల వయసు నుంచే టైగర్ డేటింగ్ లో ఉన్నాడని.. వారిద్దరూ మంచి స్నేహితులని పేర్కొన్నారు. కానీ.. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ భవిష్యత్తులో ఏ రీతిలో ఉంటుందన్న విషయాన్ని తాను చెప్పలేనని చెప్పారు.

తనకు తెలిసినంత వరకు తన కుమారుడి ఫోకస్ మొత్తం ప్రేక్షకుల మనసుల్ని దోచుకునే కథతో వస్తున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా తన కొడుకు పని మీదనే శ్రద్ధ చూపిస్తున్నాడని ప్రకటించిన వైనంతో చూస్తే.. డేటింగ్ అంతా గతమన్నట్లుగా అనిపించక మానదు. మరేం జరుగుతుందో ఫ్యూచరే చెప్పాలి.