Begin typing your search above and press return to search.

సల్మాన్ ఖాన్ ‘గెస్ట్’గా జాకీ..

By:  Tupaki Desk   |   27 Dec 2020 5:15 AM GMT
సల్మాన్ ఖాన్ ‘గెస్ట్’గా జాకీ..
X
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘రాధే’. లాక్ డౌన్ ముందే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్.. విరామం అనంతరం మళ్లీ మొదలైంది. స్టార్ కొరియో గ్రాఫర్ ప్రభుదేవా డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో శరవేగంగా జరుగుతోంది.

అయితే.. లేటెస్ట్ న్యూస్ ఏమంటే.. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ ఓ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పోలీసు అధికారిగా జాకీ కనిపించబోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. జాకీ షూట్ కూడా ఇటీవలే ముగిసిందని తెలుస్తోంది. సల్మాన్ గత చిత్రం ‘భరత్’ లోనూ జాకీ ఓ గెస్ట్ రోల్ లో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సల్మాన్ ‘రాధే’లో ఇంకా పలువురు నటిస్తున్నారు. దిషా పటాని, రణదీప్ హుడాతోపాటు కోలీవుడ్ అమ్మడు మేఘా ఆకాష్ కూడా ఈ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది మేఘా. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 14 హోస్ట్ గా ఉన్నారు సల్మాన్. ఆయన నేతృత్వంలో ‘బిగ్ బాస్’ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఓవైపు షోలో పాల్గొంటూనే.. మరోవైపు సినిమాలు ఆగకుండా చూసుకుంటున్నారు సల్మాన్. ప్రస్తుతం ‘రాధే’ చిత్రంలో నటిస్తున్న సల్మాన్.. ‘కబీ ఈద్ కబీ దివాళి’ పేరుతో తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ సల్లూభాయ్ హీరోగా నటిస్తున్నారు.