Begin typing your search above and press return to search.

జాకీ కోసం అంత తగలేస్తున్నాడేంటి!!

By:  Tupaki Desk   |   4 April 2016 6:12 AM GMT
జాకీ కోసం అంత తగలేస్తున్నాడేంటి!!
X
జాకీ చాన్‌. ప్రపంచమంతా ఇష్టపడే యాక్షన్‌ కామెడీ హీరో. అయితే మనోడు ఇప్పడు వయస్సు మీద పడటంతో కాస్త స్లోగా సినిమాలను తీస్తున్నాడు. ఇప్పుడు మాత్రం ''కుంగ్‌ ఫూ యోగా'' అంటూ ఇండియన్‌ యోగాకు కుంగ్‌ ఫూ మిక్స్‌ చేసి.. ఏదో ప్రయత్నిస్తున్నాడు. అయితే సినిమాలో అంతా ఇండియన్‌ క్యాస్టింగే. సోనూ సూద్‌.. అమైరా దస్తూర్‌.. దిశా ప్యాట్నీ (లోఫర్‌ హీరోయిన్‌).. ఇలా అందరూ మనోళ్ళు.

ఇప్పుడు విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఒక పాటను హీరోహీరోయిన్లు జాకీ చాన్‌ అండ్‌ దిశా పై ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ కంపోజ్‌ చేస్తోంది. బాగానే ఉంది. అయితే ముంబయ్‌ నుండి ఫరా జైపూర్‌ రావడానికి ఏకంగా ఇద్దరు మనుషులు కోసం ఒక స్పెషల్‌ ఫ్లయిట్‌ ఎరేంజ్‌ చేశాడట సోనూ. జాకీ ఇండియా వచ్చినప్పటి నుండి ఆయన కోసం చాలా డబ్బులు తగలేస్తున్నాడు మనోడు. మరి ఇంతగా ఎందుకు ఖర్చుపెట్టేస్తున్నాడంటూ ఇప్పుడు బాలీవుడ్‌ కూడా షాకైపోతోంది.

కొంపతీసి ఈ సినిమాకు సోనూ సూద్‌ ఏమన్నా ప్రొడక్షన్‌ లో పార్టనర్‌ అయ్యుంటాడా? ఆ మధ్యన బాలీవుడ్‌ లో ఓ సినిమా తీసి చేతులు కాల్చుకున్న సోనూ.. ఇప్పుడు హాలీవుడ్‌ లో కూడా లక్‌ టెస్టు చేసుకుంటున్నాడనాలేమో.