Begin typing your search above and press return to search.

చారుశీలగా హాట్ యాంకర్

By:  Tupaki Desk   |   13 Sep 2015 5:30 PM GMT
చారుశీలగా హాట్ యాంకర్
X
మాటీవీలో ‘యువ’ సీరియల్ తో పాపులరైన అమ్మాయి రష్మి గౌతమ్. ఆ తర్వాత కరెంట్ - ప్రస్థానం లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఐతే ఐదేళ్లకు పైగా టీవీ - సినీ ఇండస్ట్రీస్ లో ఉన్నా రాని గుర్తింపు.. ఒకే ఒక్క ప్రోగ్రామ్ తో వచ్చేసింది ఆమెకు. ఆ ప్రోగ్రామే.. జబర్దస్త్. ఈ ప్రోగ్రాంలో హాట్ హాట్ వేషాలతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది రష్మికి. ఈ పాపులారిటీతో సినిమా అవకాశాలు కూడా బాగానే వచ్చి పడుతున్నాయి.

ఇప్పటికే ‘గుంటూరు టాకీస్’ అనే సినిమాలో కీలక పాత్ర చేస్తోంది రష్మి. దీంతో పాటు ఒకటి రెండు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమెకు మరో ఆఫర్ తగిలింది. ఇది రష్మి ప్రధాన పాత్రలో నటించే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. ‘శ్రీమంతడు’ సినిమాతో పాపులరైన హీరోయిన్ పేరు ‘చారుశీల’నే ఈ సినిమాకు టైటిల్ గా పెట్టడం విశేషం.

ఈ సినిమాలో జశ్వంత్ అనే కొత్త కథానాయకుడు నటిస్తున్నాడు. బ్రహ్మానందం - రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస్ ఉయ్యూరు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. జయశ్రీ అప్పారువు ‘జ్యోత్స్న ఫిలిమ్స్’ బేనర మీద ‘చారుశీల’ను నిర్మిస్తున్నాడు. సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తి చేసి.. ఈ ఏడాది ఆఖర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. రష్మి కీలక పాత్ర పోషించిన ‘గుంటూరు టాకీస్’ వచ్చే నెలలో విడుదలవుతుంది.