Begin typing your search above and press return to search.

జబర్ధస్త్ వినోదినిని వినోద్ గా చూశారా?

By:  Tupaki Desk   |   23 Aug 2016 3:00 PM IST
జబర్ధస్త్ వినోదినిని వినోద్ గా చూశారా?
X
ఈటీవీ లో వచ్చే జబర్ధస్త్ కార్యక్రమానికి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. నాగబాబు - రోజాలు జడ్జ్ లుగా.. హాట్ యాంకర్స్ అనసూయ - రేష్మి లు యాంకర్లు గా ఈ కార్యక్రమం మూడు పువ్వులు - ఆరు కాయలుగా నడుస్తుంది. కార్యక్రమం మొదలైన కొన్నాళ్లకు మీడియాలో ఇది హాట్ టాపిక్. ఒక పక్క వల్గారిటీ ఎక్కువైపోతుందని, మగాళ్లు ఆడవాళ్లుగా గెటప్స్ వేసి చేసే చిత్రవిచిత్ర వేషాలు అసహ్యంగా ఉంటున్నాయని తెగ కామెంట్స్ వినిపించేవి. ఇదే సమయంలో జబర్ధస్త్ లో నటించే ఆర్టిస్టులు కొంతమంది బయట కూడా వివాదాలతో మీడియా ముందు నిలబడటం వంటి సంఘటనలు జరగడం కూడా తెలిసిందే. అయితే ఈ షో పై వచ్చిన ఏ కామెంట్స్ కూడా దీని వైభవాన్ని తగ్గించలేకపోయాయి.

ఈ క్రమంలో ప్రత్యేకంగా చెప్పుకునే అంశం ఆడవాళ్ల గెటప్పుల్లో కనిపించే మగవారి గురించి. అయితే ఈ జబర్దస్త్‌ లో ఎంతో మంది కమెడియన్స్ లేడీ గెటప్స్ వేస్తున్నప్పటికీ కొంతమంది కామెడీగా కనిపిస్తారు, మరి కొందరు అసహ్యంగా కనిపిస్తారు అనే కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో ఒక్కరిని చూస్తే మాత్రం నిజంగానే అమ్మాయా అనే అనుమానం కలగకమానదు. ఆ ఒక్క లేడీ గెటప్ వేసిన ఒక్క కమెడియన్ మాత్రం అచ్చమైన అమ్మాయిలానే కనిపిస్తాడు. ఎంతలా అంటే.. అమ్మాయిలకే అసూయ కలిగించే అంతలా. ఆ కమెడియన్ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. జబర్దస్త్ లో వినోదినిగా పేరు తెచ్చుకున్న వినోద్. ఇప్పటివరకూ బయట ప్రపంచానికి లేడీ గెటప్‌ లో మాత్రమే తెలిసిన వినోదిని అలియాస్ వినోద్ నిజరూపంలో ఎలా ఉంటుందో.. సారీ సారీ.. ఎలా ఉంటాడో మీరే చూడండి.