Begin typing your search above and press return to search.

బన్నీ గురించి వేణు చెప్పిన రహస్యం

By:  Tupaki Desk   |   2 May 2017 10:32 AM IST
బన్నీ గురించి వేణు చెప్పిన రహస్యం
X
అల్లు అర్జున్ గురించి ఎవరైనా మాట్లాడితే.. అందులో ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పే మాటలు తప్పకుండా వినిపిస్తాయి. ఆన్ స్క్రీన్ పై ఎంతటి ఎనర్జిటిక్ గా కనిపిస్తాడో.. ఆఫ్ స్క్రీన్ లోనూ అంతే యాక్టివ్ గా ఉండడం ఈ అల్లు హీరో స్పెషాలిటీ. అంతే కాదు.. బన్నీలో ఉన్న ఫన్నీ యాంగిల్ ను ఇప్పుడు పూర్తిగా బయటకు తీసుకురానుంది డీజే-దువ్వాడ జగన్నాధం మూవీ.

బన్నీ గురించి.. బన్నీతో తనకున్న అనుబంధం గురించి చెప్పిన జబర్దస్త్ వేణు.. ఆయన ఎనర్జీ చాలా ఇష్టం అంటున్నాడు. 'బన్నీ అన్నయ్య ప్రతీ సినిమాకి వేరియేషన్ ఉంటుంది. హెయిర్ స్టైల్.. బాడీ లాంగ్వేజ్.. స్టైల్ వేర్వేరుగా చూపిస్తాడు. అంతేకాదు.. మంచి వెల్ విషర్.. మంచి సపోర్టర్ కూడా' అని చెప్పిన వేణు.. తనకు అల్లు అర్జున్ తో ఉన్న అనుబంధం గురించి వివరించాడు. ' రుద్రమదేవికి బన్నీతో కలిసి ట్రావెల్ చేశాను. ఆ మూవీలో గోన గన్నారెడ్డి పాత్రకు రాజసింహ డైలాగ్స్ రాశారు. తెలంగాణ స్లాంగ్ లో రాయాల్సి ఉండడంతో నన్ను కూడా తీసుకెళ్లారు రాజసింహ' అంటూ ఆనాటి విషయాలను మరింత డీటైల్డ్ గా చెప్పాడు వేణు.

'బన్నీ అన్నయ్య దగ్గరకు వెళ్లాక కంఫర్ట్ జోన్ కి వెళ్లానని అర్ధమైంది. డిస్కషన్స్ లో ఉన్నపుడు ఓ చిన్న ఐడియా ఇచ్చాను.. ఇది బాగుంటుంది అన్నాను. ఆయనకు అది బాగా నచ్చింది. డైరక్టర్ తో డిస్కస్ చేశారు. ఇంట్రడక్షన్ సమయంలో వచ్చే డెప్త్ డైలాగ్ ఐడియా నేనే ఇచ్చాను. ఆ చిన్న హెల్ప్ కి సైమా.. ఐఫాలో ప్రతి చోటా థ్యాంక్స్ చెబుతూనే ఉన్నాడు బన్నీ. థియేటర్లో రెస్పాన్స్ అద్భుతం.. ఇందు కారణం నువ్వే అంటాడు. తను కష్టపడతాడు.. అలాగే ఎదుటివారి కష్టాన్ని గుర్తిస్తాడు. దటీజ్ బన్నీ' అంటున్నాడు వేణు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/