Begin typing your search above and press return to search.

మరో నెటిజన్‌ కు జబర్దస్త్‌ హాట్ కౌంటర్‌

By:  Tupaki Desk   |   21 Feb 2021 10:00 AM IST
మరో నెటిజన్‌ కు జబర్దస్త్‌ హాట్ కౌంటర్‌
X
జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుందనే విషయం తెల్సిందే. తన హాట్‌ ఫొటో షూట్‌ ను రెగ్యులర్‌ గా ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తుంది. తాజాగా అనసూయ చీర కట్టులో ఉన్న ఒక ఫొటో షూట్‌ ను షేర్‌ చేసి తన నడుము అందాన్ని ఎక్స్‌ పోజ్‌ చేస్తూ చాలా అందంగా కనిపించింది. చీరలో అనసూయ అందానికి ఫిదా అయిన వారు ఎంతో మంది. అంతగా అభిమానులను ఫిదా చేసిన అనసూయకు కోపం వచ్చింది. ఒక నెటిజన్‌ చేసిన కామెంట్‌ తో ఆమె ఆగ్రహం తెచ్చుకుంది. అతడు సరదాగా ఆ వ్యాఖ్యలు చేసినా అనసూయ మాత్రం సీరియస్ గా తీసుకుని సీరియస్‌ గా కౌంటర్ ఇచ్చింది.

చీర కట్టుకుని సమంత 'అఆ' సినిమాలో తలుపు చాటుకు నిల్చున్న సీన్‌ లో మాదిరిగా అనసూయ కూడా ఫొటో షూట్‌ కు ఫోజ్ లు ఇచ్చింది. ఆ ఫొటోకు ఒక నెటిజన్‌ నువ్వు ఏమైనా అఆ సినిమాలో సమంత అనుకుంటున్నావా అంటూ ఒక మీమ్‌ ను షేర్‌ చేశాడు. దానికి సమాధానంగా లేదమ్మా నన్ను అనసూయ అంటారు అంటూ రిప్లై ఇచ్చింది. సారీ మేడమ్‌ ఏదో సరదాగా (జస్ట్‌ కిడ్డింగ్‌) అంటూ ఆమె రిప్లై కు సమాధానం ఇచ్చాడు. మరో సారి అనసూయ స్పందిస్తూ అవును నువ్వు మానసికంగా కిడ్‌ వేనని అర్థం అయ్యింది. నువ్వు త్వరగా ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ కౌంటర్‌ ఇచ్చింది. ఈ మొత్తం సంభాషణను తన ఇన్‌ స్టా స్టోరీలో షేర్‌ చేసింది.