Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌: జెబ్ హ్యరీ మెట్ సెజల్

By:  Tupaki Desk   |   22 July 2017 8:11 AM GMT
ట్రైలర్ టాక్‌: జెబ్ హ్యరీ మెట్ సెజల్
X
ఇప్పుడు షారూఖ్ ఖాన్ 'జెబ్ హ్యారీ మెట్ సెజల్' సినిమాతో వస్తున్నాడు. చాల ఏళ్ళు తరువాత షారూక్ తన కూల్ సెక్సీ లుక్ తో అందరిని ఆకట్టుకున్నాడు ఖాన్. కథలో వైవిధ్యం, మలుపులు, ప్రయోగాలు ఏమి లేకుండా కేవలం ప్రేమ కోసం వెతికే మనసుతో వస్తున్నాడు. ఇంతియాజ్ ఆలీ సినిమాలు అంటేనే ప్రయాణం అని చెప్పవచ్చు. ఏ చోటులో ఉన్న నువ్వు నీలా కాకుండా వేరే లా ఉంటావు కానీ ప్రయాణంలో మాత్రమే నువ్వు ఏంటో బయటపడతావు అని నమ్మి తన మొదటి సినిమా నుండి ఇప్పటి జబ్ హ్యారి మెట్ సెజల్ వరకు తీశాడట. పదండి ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

పంజాబ్ నుండి యూరోప్ వెళ్ళి అక్కడ టూరిస్ట్ గైడ్ గా పని చేస్తున్నాడు హరీందర్ సింగ్. వెళ్ళుతున్నప్పుడే చెబుతున్నాడు ఏదో తను నేను పోగొట్టుకున్నది ఉంది అది మీకు అర్ధం కావటంలేదు అని. అలానే మరో పక్క సెజల్ (అనుష్కశర్మ) పెళ్లి ఫిక్స్ అయి యూరోప్ దేశానికి విహారానికి వెళ్తుంది. అక్కడ తన ఎంగేజ్మెంట్ రింగ్ పారేసుకుంది. ఇక్కడ మొదలువుతుంది మన హీరో హీరోయిన్లు వెతకడం.. ఈ వెతకడంలోనే గతాన్ని మరిచి కొత్త జీవితానికి వాళ్ళ ప్రేమతో శ్రీకారం కడతారా అనేదే సినిమా. నువ్వు ఏమి వెతుకుతావో అది నిన్ను వెతుకుతుంది అని చెబుతూనే షారూక్ తన పాత్రలో ఏదో గతం ఉంది దాన్ని కప్పిపుచ్చి కామిడీ చేస్తూ అల్లరి చిల్లరిగా నటిస్తూ కనిపించాడు. అనుష్క కూడా కూల్ మోడ్రన్ లుక్ తో క్లాస్ గా కనిపించింది. ఇంకో విషయం ఏంటంటే షారూక్ అనుష్క ల మధ్య కెమిస్త్రీ అందరిని అలరించబోతుందని చెప్పవచ్చు.

​కొంచం బాధ, కొంచం సరదా, ప్రేమ కోసం వెతుకుతున్న రెండు హృదయాలు ఇలా హ్యారి , సెజల్ యూరోప్ సిటీ రోడ్లులో పరుగు పెడుతూ కొన్ని మలుపు మధ్య వాళ్ళ ప్రేమ ను అందుకోబోతున్నట్లున్నారు. ఇక షారూక్ పంజాబీ భాష అనుష్క శర్మా గుజరాతీ భాష మాట్లాడుతుంటే మరింత కొత్త గా ఉంది అనే చెప్పాలి. ఇలా భాషతో కూడా కొంత కొత్తదనాన్ని పూసి పాత్రలను ఆసక్తిగా మార్చాడు డైరెక్టర్ ఇంతియాజ్ ఆలీ. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై నిర్మించిన జబ్ హ్యారి మెట్ సెజల్ ఆగష్టు 4 న విడుదలకాబోతుంది. ​