Begin typing your search above and press return to search.

షారుక్ సినిమాకు టైటిల్ దొరికింది

By:  Tupaki Desk   |   9 Jun 2017 5:08 AM GMT
షారుక్ సినిమాకు టైటిల్ దొరికింది
X
షారుక్ ఖాన్ – అనుష్క శర్మా జోడీగా నటిస్తున్న ఇంతియాజ్ ఆలీ డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాల కాలం అయ్యింది. కానీ ఈ సినిమా చాలాసార్లు ఈ విషయంగానే న్యూస్ లోకి వచ్చేది. ఆగష్టు లో విడుదల పెట్టికొని షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది సినిమా టైటిల్ ఎందుకు పెట్టలేదు అని అందరిలో చర్చ మొదలైంది. ఎట్టకేలకు ఒక పేరు పెట్టారు సినిమాకు.

వీళ్ళ ముందు చాల పేర్లు లిస్ట్ ఉండటం ఏది పెట్టాలో తికమక పడి లేట్ అయ్యింది అని చెప్పారు. ఈ సినిమాకు మొదట ‘రెహనుమా’ అనే ఉర్దూ టైటిల్ అనుకున్నారు తరువాత ‘రౌళా’ అనే పంజాబీ టైటిల్ ను అనుకున్నారు. కానీ మొత్తానికి ఒక ఇంగ్లిష్ మూవీ ‘వెన్ హ్యారి మెట్ సాల్లి’ అనే సినిమా లాంటి టైటిల్ పెట్టారు. షారుక్ హ్యారి గా అంటే హర్విందర్ పాత్రలో అనుష్క ఏమో శెజల్ గా నటించబోతుంది. షారుక్ ఖాన్ కు R అక్షరం బాగానే కలిసివచ్చింది ముందు చిత్రం 'రయీస్‌' కూడా మొదటి అక్షరం R కావడంతో షారుక్ టీమ్ R తో వచ్చేలా చూడాలి అనుకున్నారు కానీ చివరకు ‘జబ్ హ్యారి మెట్ శెజల్’గా ఖరారు అయ్యింది.

ఈ సినిమా కొత్త పోస్టర్ ఇవాళ రేపట్లో విడుదల చేస్తారు. సల్మాన్ ఖాన్ సినిమా ట్యూబ్లైట్ విడుదలతో షారుక్ సినిమా ట్రైలర్ను జూన్ 19 లేదా 20న విడుదల చేయవచ్చు అని తెలుస్తుంది. ఈ సినిమా విడుదల కూడా అక్షయ్ కుమార్ సినిమా టాయ్లెట్ ఏక్ ప్రేమ్ కథ సమయంలో ఒకేసారి విడుదలై జగడము జరుగుతుంది ఏమో అని అనుకున్నారు. కానీ షారుక్ సినిమాను ఆగష్టు 11న విడుదల ఏసే ఛాన్సుందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/