Begin typing your search above and press return to search.

చైతూకు ఆ యోగ్యత వచ్చిందన్న రచయిత

By:  Tupaki Desk   |   13 Oct 2016 11:57 AM GMT
చైతూకు ఆ యోగ్యత వచ్చిందన్న రచయిత
X
జె.కె.భారవి.. తెలుగు సినిమా రచయితల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పేరు. అన్నమయ్య.. శ్రీరామదాసు లాంటి సినిమాలకు రచన చేసి తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడీ రచయిత. ప్రస్తుతం అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’కు కూడా ఆయనే రచన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన అనుకోకుండా నాగార్జునకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ నాగ్ తనయుడు నాగచైతన్య గురించి కావడం విశేషం. చైతూ కొత్త సినిమా ‘ప్రేమమ్’ చూసి ముగ్ధుడైపోయిన భారవి.. ఈ లేఖ రాయడం విశేషం.

‘‘నమస్తే.. నాగార్జున గారూ. ప్రేమ‌మ్ చూశాను. చైతూ అద్భుతంగా న‌టించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అతను చేసిన అన్ని సినిమాల క‌న్నా.. ‘ప్రేమ‌మ్’లో టెర్రిఫిక్ మెచ్యూరిటీ లెవెల్స్ అబ్జర్వ్ చేశాను. ప‌ర్ఫెక్ట్ యాక్టర్ గా ఈ సినిమాతో ఫ్రూవ్ చేసుకున్నాడు. తాత గారి ప‌క్క‌న‌.. మీ ప‌క్క‌న నిల‌బ‌డే యోగ్య‌త‌ను సంపాదించాడు. చేయించుకునేవాడుంటే ఏదైనా చేయ‌గ‌ల‌ను అని చాటిచెప్పాడు. ఏఎన్నార్ లాంటి మ‌హాన‌టుడి వార‌సుడు మీరు. చైతూ మీ వార‌సుడు. ఈ జాబితాలోకి అఖిల్ కూడా చేరాల‌ని ఆశిస్తున్నాను. మీ పుత్రోత్సాహానికి జ‌య‌హో’’ అంటూ అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు భారవి. విజయ దశమి సందర్భంగా భారవి నాగార్జునకు ఈ లేఖ రాశారట. ఆ లేఖను సోషల్ మీడియాలో నాగ్ అభిమానులతో పంచుకున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/