Begin typing your search above and press return to search.

గెడ్డం చక్రవర్తి.. సీక్రెట్ గా పెళ్ళయ్యింది

By:  Tupaki Desk   |   19 Aug 2016 4:13 AM GMT
గెడ్డం చక్రవర్తి.. సీక్రెట్ గా పెళ్ళయ్యింది
X
గెడ్డం చక్రవర్తి వురఫ్‌ జేడీ చక్రవర్తి సినిమా కెరీర్ రకరకాలుగా ఉంటుంది. ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత 'గులాబీ'తో హీరో అయిపోయిన జేడీ.. వివాదాలకు.. వివాదాస్పద కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ లా అనిపిస్తాడు. రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చినోడు కావడంతో.. ఆ లక్షణాలు చాలానే ఉంటాయి. కొన్ని వర్మని మించినోడు అనే టాక్ కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడీ హీరో రియల్ లైఫ్ లో గులాబి ఓ అమ్మాయికి ఇచ్చేసి.. లైఫ్ పార్ట్నర్ చేసేసుకున్నాడు.

హీరోయిన్ అనుకృతి గోవింద్ శర్మతో జేడీకి లవ్ అఫైర్ ఉందంటూ చాలా రోజులగానే టాక్ వినిపిస్తోంది. ఈమెతో సినిమా తీస్తున్న ఓ నిర్మాత.. జేడీతో లవ్ లో పడి సినిమాని నిర్లక్ష్యం చేస్తోందంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కంప్లెయింట్ కూడా ఇచ్చాడు. ఆ మూవీ పేరు 'పాప'. తనతో బూతులు చెప్పిస్తున్నారంటూ.. ఈ అమ్మడు రిటార్ట్ కూడా ఇచ్చింది లెండి. వీటన్నిటి కంటే ముందు.. శ్రీదేవి అనే టైటిల్ తో మొదలయ్యి సావిత్రిగా మారిన రామ్ గోపాల్ వర్మ మూవీలో కూడా ఈమే హీరోయిన్.

అప్పటి నుంచే వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ మొదలవగా.. ఇప్పుడది పెళ్లిపీటల వరకూ వచ్చింది. అయితే.. జేడీ చక్రవర్తి-అనుకృతిలు ఈ పెళ్లిని పెద్దగా ఆర్భాటం లేకుండానే సన్నిహితుల మధ్య చేసేసుకున్నారు. ఇద్దరూ కూడా రామ్ గోపాల్ వర్మ సినిమాలతో కెరియర్ ను మొదలెట్టి.. చివరకు ఇలా సీక్రెట్ గా పీటలు ఎక్కేశారు. ఎనీవే - కంగ్రాట్స్ జెడి అండ్ అనుకృతి.