Begin typing your search above and press return to search.
'IVNR' ప్రమోషనల్ సాంగ్: 'బండి తియ్' అంటున్న అక్కినేని హీరో..!
By: Tupaki Desk | 20 Aug 2021 7:14 PM ISTఅక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఇచ్చట వాహనములు నిలుపరాదు''. 'నో పార్కింగ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఎస్. దర్శన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 27న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సార్ కు వెళ్లిన ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికేట్ జారీ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్.. ప్రమోషనల్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 'బండి తియ్' అనే ప్రచార గీతాన్ని రూపొందించారు.
'పొద్దున లేచి స్నానం చేసి.. గత్తర లేపి.. అత్తరు పూసి.. అమీర్ పేట చౌరస్తాలో అమ్మాయి కోసం వెయిటింగ్.. బండి తియ్..' అంటూ సాగిన IVNR ప్రమోషనల్ సాంగ్ ను యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రవీణ్ లక్కరాజు ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేశారు. సురేష్ గంగుల లిరిక్స్ రాయగా.. రాహుల్ సిప్లిగంజ్ తనదైన శైలిలో హుషారుగా ఆలపించారు. సినిమా టైటిల్ కు తగ్గట్టుగా వాహనాలు - ట్రాఫిక్ నేపథ్యంలో ఈ పాట రూపొందించారు.
'బండి తియ్' సాంగ్ లో హీరో సుశాంత్ డ్యాన్స్ మూవ్స్ - హీరోయిన్ మీనాక్షి చౌదరి హాట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట సినిమా పబ్లిసిటీ కోసంఎలా ఉపయోగపడుతుందో చూడాలి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక విలక్షణమైన థ్రిల్లర్ గా ''ఇచ్చట వాహనములు నిలుపరాదు'' రూపొందింది. ఇందులో వెంకట్ - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - అభినవ్ గోమతం - ఐశ్వర్య - నిఖిల్ కైలాస - కృష్ణ చైతన్య ఇతరులు ఇతర పాత్రలలు పోషించారు.
ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రవిశంకర్ శాస్త్రి - ఏక్తా శాస్త్రి - హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. 'చిలసౌ' వంటి సూపర్ హిట్ తర్వాత సుశాంత్ సోలో హీరోగా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.