Begin typing your search above and press return to search.

వరుణ్ కి డాలర్స్ టైమొచ్చింది!!

By:  Tupaki Desk   |   24 Feb 2018 1:05 PM IST
వరుణ్ కి డాలర్స్ టైమొచ్చింది!!
X
బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలంటే కొంచెం కాలంతో పరిగెత్తక తప్పదు. హీరోగా లక్షణాలు అన్ని ఉన్నా సరే ప్రస్తుతం సక్సెస్ లు రావడం లేదు. మంచి కథ వచ్చే టైమ్ వస్తే బాక్స్ ఆఫీస్ లో కొన్ని పేజీలు ఉంటాయి. ఆ రోజు కోసమే మెగా హీరో వరుణ్ తేజ్ చాలా ఎదురుచూశాడు. మెగా ఫ్యామిలిలో అందరు కొద్దీ కాలం లోనే బాక్స్ ఆఫీస్ ని టచ్ చేశారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం సమయాన్ని కాస్త ఎక్కువగానే తీసుకున్నాడు.

ఆ అపజయాలు మనోడికి మంచి పాఠాలు కూడా నేర్పాయి. దీంతో ఓ విధంగా వరుణ్ కి అనుభవం వచ్చింది. అప్పటి నుంచి వరుస హిట్స్ అందుకునే పనిలో పడ్డాడు. ఆ ఆలోచనతో మంచి కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా తొలిప్రేమ సినిమాతో వరుణ్ మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. ఈ హిట్ అతనికి ఎంతగానో ఉపయోగపడింది. అయితే అమెరికాలో ఈ సినిమా $1 మిలియన్ దాటింది.

ఇంతకుముందు వచ్చిన ఫిదా సినిమా కూడా మనోడికి మంచి సక్సెస్ ఇచ్చిన సంగతి సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ ని అందుకుంది. ఇప్పుడు తొలిప్రేమ సినిమాతో కూడా ఆ మార్క్ ను అందుకున్న హీరోగా గుర్తింపు పొందాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు కొంచెం పికప్ అయ్యాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం అలాగే థమన్ సరికొత్త సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు.