Begin typing your search above and press return to search.

రౌడీ గారి VD12 ప్రకటన వచ్చేసిందిగా

By:  Tupaki Desk   |   18 Dec 2019 5:05 AM GMT
రౌడీ గారి VD12  ప్రకటన వచ్చేసిందిగా
X
యువ హీరో విజయ్ దేవర కొండ జోరు మామూలు గా లేదు. వరసబెట్టి ప్రాజెక్టులను ఫైనలైజ్ చేస్తున్నాడు. విజయ్ నటించిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమా కు ఇప్పటికే పచ్చ జెండా ఊపాడు.. ప్రస్తుతం ఈ సినిమా కు ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్టు ను కూడా లైన్ లో పెట్టాడు విజయ్.

ఈరోజు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కనున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #VD12 సినిమాను ప్రకటిస్తూ విజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా దిల్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. "హ్యాపీ బర్త్ డే రాజు సర్. బ్లాక్ బస్టర్ గిఫ్ట్ లోడింగ్. ప్రేమతో.. గౌరవంతో: శివ నిర్వాణ & విజయ్ దేవరకొండ" అంటూ ట్వీట్ చేశాడు.

ఎమోషనల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడం లో శివ నిర్వాణ కు మంచి పట్టుందనే విషయం 'నిన్ను కోరి'.. 'మజిలీ' సినిమాల తో అందరికీ అర్థం అయింది. ఇలాంటి దర్శకుడు.. విజయ్ లాంటి ఇంటెన్స్ యాక్టర్ కలిస్తే ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఎక్కువే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.