Begin typing your search above and press return to search.

అలాంటి కంటెంట్ తో నిల‌దొక్కుకోవ‌డం క‌ష్ట‌మే...!

By:  Tupaki Desk   |   17 July 2020 5:40 PM IST
అలాంటి కంటెంట్ తో నిల‌దొక్కుకోవ‌డం క‌ష్ట‌మే...!
X
దేశవ్యాప్తంగా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ని ఆశ్రయిస్తున్నారు. విరివిరిగా అందుబాటులో ఉన్న డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో వచ్చే కంటెంట్ ని వీక్షిస్తున్నారు. ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీసులను ఒరిజినల్ మూవీస్ ని చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఓటీటీలు పుంజుకోవడంతో పాటు సబ్స్క్రైబర్ర్స్ పెంచుకుంటూ పోతున్నారు. అంతేకాకుండా కొన్ని ఓటీటీలు విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త సినిమాలను కొనుక్కొని తమ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే కొత్తగా డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టిన ఓ ఓటీటీ మాత్రం ఓల్డ్ కంటెంట్.. డబ్బింగ్ కంటెంట్ ని తమ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ కంటెంట్ కోసం ఓ డిజిట‌ల్ సంస్థ‌తో సదరు ఓటీటీ ఒప్పందం కూడా చేసుకుందట.

కాగా సదరు డిజిట‌ల్ సంస్థ‌ వారు ఇంతకముందు ఓ పాపులర్ ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిజానికి తెలుగులో క్రేజ్ కోసం వారి వీడియో లైబ్రరీ పెంచుకోవ‌డానికి మాత్రమే సదరు డిజిటల్ ఆర్గనైజేషన్ తో డీల్ చేసుకున్నారట. అయితే అప్పటి వరకు మంచి కంటెంట్ అందుబాటులో ఉంచుతున్నారు అని పేరు తెచ్చుకున్న ఓటీటీ కాస్తా చాలా చీప్ కంటెంట్ లోడ్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంది. దీంతో ప్రముఖ ఓటీటీ బ్రాండ్ కు తెలుగులో ఆదరణ తగ్గిపోయింది. అందులోనూ మరో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో హిట్ సినిమాలతో పాటు మంచి కంటెంట్ అప్ లోడ్ చేస్తాడ‌నే టాక్ కూడా స్ప్రెడ్ అవ్వ‌డంతో ఆలోచనలో పడ్డ టాప్ ఓటీటీ.. సదరు డిజిటల్ సంస్థ‌లో డీల్ క్యాన్సిల్ చేసుకొని.. ఏదో నామ‌మాత్రంగా రిలేష‌న్స్ కొన‌సాగిస్తున్నారు. అయితే ఇంత జ‌రిగాక ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటీటీ కూడా త‌మ వీడియో కంటెంట్ ని పెంచుకోవ‌డానికి వారినే ఆశ్ర‌యించ‌డం రాంగ్ స్టెప్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే సదరు కంపెనీతో డీల్ మొద‌లుపెట్టినప్పటి నుంచి మ‌రింత నాసిర‌కం కంటెంట్ కొత్త ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా రెండు మలయాళ త‌మిళ డ‌బ్బింగ్ సినిమాను సదరు ఓటీటీ త‌మ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేశారు. ఇలాంటి సినిమాలు చూడటానికి ఆ యాప్ ఓపెన్ చేయాలా అనే కామెంట్స్ వచ్చాయి. ఈ సినిమాలు కూడా సదరు డిజిటల్ కంపెనీ ద్వారానే డీల్ అయింద‌ని సమాచారం. అస‌లే ఇతర ఓటీటీలతో పోటీప‌డ‌లేక కాస్త వెనుకంజ‌లో ఉన్న కొత్త ఓటీటీ ఇప్పుడు త‌మ వీడియో లైబ్రెరీని పెంచుకోవ‌డానికి చెత్త కంటెంట్ ని అప్లోడ్ చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది. ఇప్పటికైనా రియలైజ్ అయి మంచి కంటెంట్ ని స్ట్రీమింగ్ చేస్తేనే ఈ కాంపిటేషన్ లో నిలదొక్కుకోగలరని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు.