Begin typing your search above and press return to search.

ఈ రెండు నెలలు అలా గడిచిందంటున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   19 Jun 2020 6:10 AM GMT
ఈ రెండు నెలలు అలా గడిచిందంటున్న ఇస్మార్ట్‌ బ్యూటీ
X
ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ స్టార్స్‌ దృష్టిని ఆకర్షించి ప్రేక్షకుల అభిమానంను సంపాదించుకున్న ముద్దుగుమ్మ నభా నటేష్‌. అంతకు ముందే నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నభా నటేష్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకుని వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. ఇప్పటికే ఈమె సోలో బ్రతుకే సోబెటర్‌ ఇంకా అల్లుడు అదుర్స్‌ చిత్రాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు కూడా చివరి దశ చిత్రీకరణలో ఉన్నాయి. ఈ సమయంలో మహమ్మారి వైరస్‌ కారణంగా షూటింగ్స్‌ ఆగిపోయాయి. దాంతో తన సొంత రాష్ట్రం కర్ణాటకలో నభా నటేష్‌ గత రెండు నెలలుగా ఉండి పోయింది.

కర్ణాటకలో చిక్మగలూరులో తన కుటుంబ సభ్యులతో ఈ సమయంను గడుపుతున్న నభా తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన ఈ రెండు నెలల సమయంను ఎలా గడిపిందో పేర్కొంది. షూటింగ్స్‌ ఉన్న సమయంలో హైదరాబాద్‌ హోటల్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తినేదాన్ని. దాంతో హోం ఫుడ్‌ ను మిస్‌ అయిన ఫీలింగ్‌ వచ్చేది. గత కొంత కాలంగా హోం ఫుడ్‌ ను మిస్‌ అవుతున్న నాకు ఇప్పుడు పూర్తిగా హోం ఫుడ్‌ తో చాలా సంతోషంగా ఉంది. ఇక ఎక్కువ సమయంను సినిమాలకు చూసేందుకు కేటాయించాను.

అప్పుడప్పుడు వంట కూడా చేస్తూ కుటుంబ సభ్యులతో షేర్‌ చేసుకున్నాను. ఇక నాకు ఇష్టమైన ల్యాండ్‌ స్కేప్‌ పెయింటింగ్స్‌ ను కూడా ఈ సమయంలో ఎక్కువగా వేస్తున్నాను. ఈ రెండు నెలల సమయంను నేను చాలా బాగా వినియోగించుకున్నాను అంటూ ఫుల్‌ హ్యాపీగా చెప్పింది. షూటింగ్స్‌ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ కూడా నభా నటేష్‌ పేర్కొంది. కొత్త సినిమాలు పలు చర్చల్లో ఉన్నాయని త్వరలోనే వాటిని ప్రకటిస్తానంటూ నభా ప్రకటించింది.