Begin typing your search above and press return to search.

బాలయ్య సినిమాలో ఆ రెండు మార్పులు చేయకుంటే ఫ్లాప్‌ అయ్యేది

By:  Tupaki Desk   |   29 Dec 2020 9:00 AM IST
బాలయ్య సినిమాలో ఆ రెండు మార్పులు చేయకుంటే ఫ్లాప్‌ అయ్యేది
X
నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో లారీ డ్రైవర్ సూపర్‌ హిట్ ను దక్కించుకుంది. ఆ సినిమా కు బి గోపాల్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విషయమై పరుచూరి పలుకులు లో భాగంగా పరుచూరి గోపాల కృష్ణ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత రషెష్‌ చూడమంటూ మా వద్దకు వచ్చింది. ఆ సమయంలో మేము కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా సినిమాలో ఉన్న శారత పాత్ర విషయంలో దర్శకుడు గోపాల్‌ తప్పు చేశాడు అనిపించింది. ఆమె పాత్రను మొదట కామెడియన్ తరహాలో షూట్‌ చేశారు. కలెక్టర్‌ పాత్రను అలా తమాషాగా చిత్రీకరించడం ఏమాత్రం సబబు కాదు అని మేము అనుకున్నాం. ఆ సీన్‌ లను మార్చాలంటూ సూచించాము.

షూటింగ్ ను మళ్లీ చేశారు. శారత పాత్రను సీరియస్ గా దర్శకుడు చిత్రీకరించారు. ఆ తర్వాత షూటింగ్ అంతా పూర్తి చేసి సెన్సార్‌ ముందుకు తీసుకు వెళ్లారు. అయితే కలెక్టర్‌ శారదను విలన్‌ చెంప దెబ్బ కొట్టే సీన్‌ తర్వాత దసరా పాట వచ్చింది. అది ఏమాత్రం సరిగా లేదు. విలన్ దెబ్బ కొట్టిన తర్వాత హీరో హీరోయిన్‌ లు శారదతో పాట పాడటం ఏమాత్రం ప్రేక్షకులు అంగీకరించే అవకాశం లేదని అన్నాము. పాట ప్లేస్‌ మెంట్‌ చేయాల్సిందిగా గోపాల్ కు సూచించాం. ఆ సమయంలో ఆయన అంగీకరించలేదు.

గోపాల్‌ వద్ద అసిస్టెంట్ గా ఉన్న స్వర్ణ సుబ్బారావు అనే వ్యక్తి గోపాల్ ను ఎందుకు పదే పదే అలా ఇబ్బంది పెడుతున్నారు అంటూ మా వద్దకు వచ్చి అన్నాడు. దాంతో అతడిపై నాకు తీవ్ర కోపం వచ్చింది. ఆ తర్వాత సినిమా కోసం గోపాల్‌ ఆలోచించి ఆ పాట ప్లేస్‌ మెంట్‌ మార్చాడు. అన్ని విధాలుగా సినిమా సెట్‌ అవ్వడంతో లారీ డ్రైవర్‌ సినిమా అనుకున్న దాని కంటే మరింత విజయాన్ని సొంతం చేసుకుంది.