Begin typing your search above and press return to search.

స‌మంత కొంచెం కేర్ తీసుకుని వుంటే బాగుండేది

By:  Tupaki Desk   |   28 April 2022 1:30 PM GMT
స‌మంత కొంచెం కేర్ తీసుకుని వుంటే బాగుండేది
X
తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది క‌థానాయిక‌లు స్టార్ హీరోయిన్ లు గా పేరు తెచ్చుకున్నారు కానీ స‌మంత మాత్రం స్టార్ నాయిక‌ల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. క్రేజీ హీరోయిన్ అయినా హీరోల‌కు స‌మాన‌మైన స్టార్ డ‌మ్ ని ద‌క్కించుకోవ‌డం విశేషం. యుట‌ర్న్‌, ఓ బేబీ వంటి చిత్రాల‌తో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలో త‌న కెరీర్ ని కొత్త ట‌ర్న్ తీప్పుకుంది. క‌మ‌ర్షియ‌ల్ నాయిక‌గా కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తోంది.

అఆ, మ‌జిలీ వంటి క‌థానాయిక ప్రాధాన్య‌త వున్న చిత్రాల‌తో మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్న స‌మంత ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టింది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం 'శాకుంత‌లం'. గుణ‌శేఖ‌ర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై నీలిమ గుణ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది.

ఇక ఈ సినిమాతో పాటు సామ్ మ‌రో లేడీ ఓరియెంటెడ్ మూవీలోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. హ‌రిశంక‌ర్‌, హ‌రి నారాయ‌ణ్ ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అవుతున్న మూవీ 'య‌శోద‌'. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

టైటిల్ పాత్ర‌లో స‌మంత న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో ఉన్ని ముకుంద‌న్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, రావు ర‌మేష్‌, ముర‌ళీశ‌ర్మ‌, సంప‌త్ రాజ్, శ‌త్రు న‌టిస్తున్నారు. ఆగ‌స్టులో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా వుంటే సామ్ న‌టించిన తాజా త‌మిళ చిత్రం 'కాదువాకుల రెండు కాద‌ల్‌' త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో సామ్ పుట్టిన రోజైన ఏప్రిల్ 28న విడుద‌లైంది. స‌మంత‌తో క‌లిసి విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార న‌టించారు. న‌య‌న్ ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించాయి. సామ్ క్రేజ్‌ని తెలుగులో క్యాష్ చేసుకోవాల‌ని తెలుగులోనే విడుద‌ల చేశారు. అయితే సినిమాకు ప్రాప‌ర్ ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డంతో పెద్ద‌గా ప్రేక్ష‌కుల్లోకి రీచ్ కాలేక‌పోయింది. స‌మంత త‌న కోస‌మైనా ఈ చిత్రాన్ని తెలుగులో ప్ర‌మోట్ చేయాల్సింది.

మ‌రింత కేర్ తీసుకుని ప్ర‌మోట్ చేస్తే ఫ‌లితం మ‌రోలా వుండేది. కానీ సామ్ ఆ విష‌యంలో అస్స‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. స‌మంత న‌టించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో సామ్ కు ఈ సినిమా మ‌రింత ప్ల‌స్ అయ్యేద‌ని చెబుతున్నారు. సామ్ న‌టిస్తున్న 'య‌శోద‌' ఆగ‌స్టు 12న విడుద‌ల కాబోతోంది.