Begin typing your search above and press return to search.

రత్తాలుకు ఒక చెల్లి ఉంటే ఇలా ఉండేది!

By:  Tupaki Desk   |   25 March 2021 12:30 PM GMT
రత్తాలుకు ఒక చెల్లి ఉంటే ఇలా ఉండేది!
X
సైలెంట్ గా 50 పైగా సినిమాల్లో న‌టించిన ల‌క్ష్మీరాయ్ స్టార్ హీరోయిన్ స్టాట‌స్ అందుకోక‌పోయినా ప్ర‌స్తుతం ద‌క్షిణాది ఉత్త‌రాది అనే తేడా లేకుండా అవ‌కాశాలు అందుకుంటోంది. సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ న‌టిస్తోంది. కెరీర్ ప‌రంగా.. `ఖైదీనంబ‌ర్ 150`లో రత్తాలు సాంగ్ ఈ అమ్మ‌డి కెరీర్ కి బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. ప్ర‌స్తుతం రాయ్ లక్ష్మి రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగు- కన్నడ- మలయాళ భాషలలో ఒక్కొక్క చిత్రంతో బిజీగా ఉన్నారు.

ఇక ఇన్ స్టా వేదిక‌గా రాయ్ ల‌క్ష్మీ రెగ్యుల‌ర్ ఫోటో ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇటీవ‌ల జిమ్ యోగా అంటూ నిరంత‌ర‌ సాధ‌న‌తో త‌న రూపాన్ని పూర్తిగా మార్చేసింది. స్లిమ్ లుక్ నుంచి ఏకంగా అల్ట్రా స్లిమ్ లుక్ కి మారిపోవ‌డం షాక్ కి గురి చేస్తోంది. తాజాగా రాయ్ ల‌క్ష్మీ షేర్ చేసిన ఓ ఫోటో యూత్ లో వైర‌ల్ గా మారింది.

లేటెస్ట్ ఫోటోలో రాయ్ ల‌క్ష్మీ టీనేజర్ లుక్ తో షాకిచ్చింది. ఉన్న‌ట్టుండి ఏజ్ త‌గ్గి జీరో సైజ్ లుక్ లోకి మారిపోయింది. ఒక‌వేళ రాయ్ ల‌క్ష్మీకి ఒక సోద‌రి ఉంటే ఇలా ఉండేదా! అంటూ యూత్ లేటెస్ట్ ఫోటోల‌పై కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఏదేమైనా రాయ్ ల‌క్ష్మీ హార్డ్ వ‌ర్క్ ఫ‌లించి మ‌రోసారి టాలీవుడ్ లో క్రేజీ ఆఫ‌ర్లు వెంట‌ప‌డ‌తాయేమో చూడాలి.