Begin typing your search above and press return to search.

#GMB మ‌హేష్ `కిలాడీ` ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు

By:  Tupaki Desk   |   20 Dec 2020 9:45 AM IST
#GMB మ‌హేష్ `కిలాడీ` ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు
X
ప‌రిశ్ర‌మ నుంచి ఎప్పుడూ తీసుకోవ‌డ‌మేనా? తీసుకున్న‌ది తిరిగిచ్చేదెపుడు? మ‌న స్టార్ హీరోల ఆలోచ‌న నెమ్మ‌దిగా ఆ కోవ‌లో ప‌రిణ‌తి చెందుతోంది. ముఖ్యంగా సూప‌ర్ స్టార్ మ‌హ‌ష్ ఇన్నాళ్లు తీసుకున్న‌ది తిరిగి ప‌రిశ్ర‌మ‌కే పెట్టుబడుల రూపంలో పెడుతుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

జీఎంబీ బ్యాన‌ర్ ప్రారంభించి అందులో యంగ్ ట్యాలెంట్ కి అవ‌కాశాలిస్తున్నారు మ‌హేష్‌- న‌మ్ర‌త బృందం. తొలిగా అడివి శేష్ హీరోగా మేజ‌ర్ చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో నిర్మిస్తున్నారు. ఇలా సొంత బ్యాన‌ర్ లో బయటి హీరోల‌తో సినిమా చేయ‌డం అన్న‌ది గివ్ అండ్ టేక్ పాల‌సీ కిందే లెక్క‌. అడివి శేష్ మేజర్ ఫస్ట్ లుక్ తో తనదైన ముద్ర వేశారు. త్వరలో సూపర్ స్టార్ మ‌రో యువ హీరోకి అవ‌కాశం ఇస్తున్నారు. ఏజెంట్ ఆత్రేయ‌గా సంచ‌ల‌నం సృష్టించిన యంగ్ ట్యాలెంట్ నవీన్ పోలిశెట్టి హీరోగా మ‌రో సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీ పోస్టర్ కూడా రిలీజ్ కి వ‌స్తోంది.

కేవ‌లం ఆ ఇద్ద‌రే కాదు.. ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు యువ‌హీరోల‌తో మహేష్ - న‌మ్ర‌త బృందం చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ప‌లు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ముందుకు వస్తారని చెబుతున్నారు. ఈ జాబితాలో సత్యదేవ్.. సిద్ధు జోన్నలగడ్డ .. రాజ్ తరుణ్ వంటి హీరోలున్నారు.

మ‌హేష్ తాను న‌టించే సినిమాల్లో నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటూ నిర్మాత‌ల‌కు భారం కాకుండా ఆదుకుంటున్నారు. అలాగే న‌వ‌త‌రం ట్యాలెంట్ ని గుర్తించి సినిమాలు నిర్మిస్తూ ఉపాధిని క‌ల్పిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఒక ర‌కంగా బాలీవుడ్ కిలాడీ అక్ష‌య్ కుమార్ త‌ర‌హాలో ఆయ‌న తీసుకున్న‌ది తిరిగి ప‌రిశ్ర‌మ‌కే ఇస్తున్నార‌ని భావించాల్సి ఉంటుంది. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ దిగ్గ‌జం సోనీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ .. రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ వంటి సంస్థ‌ల‌తో స‌త్సంబంధాలు ఉండ‌డం వ‌ల్ల కూడా మ‌హేష్ - న‌మ్ర‌త బృందం ఇలాంటి వేదిక‌ను సిద్ధం చేసుకోవ‌డానికి సాయ‌మ‌వుతోంది. మునుముందు జీఎంబీలో ఓటీటీ వెబ్ సిరీస్ ల‌కు ప్లాన్ జ‌రుగుతోంది. డిజిట‌ల్ స్పేస్ లో క్రియేటివ్ వేలో వెళ్ల‌నున్నారు. ఓవ‌రాల్ గా మ‌హేష్ టాలీవుడ్ లో ఒక పెద్ద సంస్థ‌ను ర‌న్ చేస్తూ ప్ర‌తిభావంతుల‌కు ఉపాధి మార్గాల్ని పెంచుతుండ‌డం ప్ర‌శంస‌నీయం. ఆయ‌న బాట‌లోనే ప‌లువురు స్టార్ హీరోలు ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాల్లో ఉన్నా.. ప‌నులు మ‌రింత స్పీడందుకోవాల్సి ఉంది.