Begin typing your search above and press return to search.
కోర్టులో వాదిస్తున్న లాయర్ గోపీచంద్ - లాయర్ రవితేజ
By: Tupaki Desk | 22 Feb 2021 12:35 PM GMTమాస్ మహారాజా రవితేజ - డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మారుతి ఉన్నట్టుండి యాక్షన్ హీరో గోపీచంద్ తో 'పక్కా కమర్షియల్' అనే సినిమా ప్రకటించాడు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్2 బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాని అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రిలీజ్ డేట్ కూడా లాక్ చేసిపెట్టుకున్నారు. మరోవైపు 'క్రాక్' హిట్ తో జోష్ మీదున్న రవితేజ.. తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'RT68' ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. టీజీ విశ్వ ప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఇప్పుడు రవితేజ సినిమాకి గోపీచంద్ సినిమాలకు మధ్య సిమిలారిటీలు ఉన్నట్లు తెలుస్తోంది.
'పక్కా కమర్షియల్' సినిమా కోర్టు నేపథ్యంలో సాగే డ్రామా. ఇందులో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నాడు. అయితే త్రినాథరావు సినిమాలో రవితేజ కూడా ఓ లాయర్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం. నిజానికి రవితేజతో చేయడానికే కమర్షియల్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. రెమ్యూనరేషన్ కారణంగా మారుతి సినిమాని రవితేజ రిజెక్ట్ చేయడంతో.. గోపీచంద్ తో వెళ్లారని టాక్ ఉంది. కానీ రవితేజ నో చెప్పడానికి కారణం అప్పటికే త్రినాథరావు కథకి ఓకే చెప్పడమే అని తెలుస్తోంది. త్రినాథరావు స్టోరీ కూడా కోర్టు నేపథ్యంలో ఉంటుందని.. రెండు సినిమాల్లోనూ లాయర్ పాత్రలే కావడంతో మారుతి సినిమాని రవితేజ వదులుకోవాల్సి వచ్చిందట. ఏదేమైనా గోపీచంద్ - రవితేజ ఇద్దరూ లాయర్ పాత్రలు పోషిస్తుండటం.. వీటిని ఇద్దరు కామెడీ టచ్ ఉన్న దర్శకులు తెరకెక్కిస్తుండటం ఆసక్తికరంగా మారింది. మరి ఈ రెండు స్టోరీలలో ఏది ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.