Begin typing your search above and press return to search.

కోవిడ్ అంటే బాలీవుడ్ కే భ‌యం టాలీవుడ్ కి కాదు!

By:  Tupaki Desk   |   26 April 2021 10:00 AM IST
కోవిడ్ అంటే బాలీవుడ్ కే భ‌యం టాలీవుడ్ కి కాదు!
X
ముంబై- మ‌హారాష్ట్ర స‌హా ఉత్త‌రాదిన కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర‌త అధికంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే చాలా చోట్ల క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం నెల‌కొంది. నెలాఖ‌రు వ‌ర‌కూ చాలా న‌గ‌రాల్లో లాక్ డౌన్ విధించారు. ఆ క్ర‌మంలోనే బాలీవుడ్ స్టార్లంతా షూటింగులు ఆపేసిన సంగ‌తి తెలిసిందే.

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో బాలీవుడ్ మొత్తం ఏక‌గాటాన‌ నిల‌బ‌డుతోంది. బాలీవుడ్ స్టార్లు వారికి తోచిన ప‌ద్ధుతుల్లో ప్ర‌జ‌ల‌కు క‌రోనా మీద అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఇక మిగ‌తా భాష‌ల్లో కూడా ఎక్కడిక‌క్క‌డ షూటింగులు నిలుప‌ద‌ల చేసి సినీ కార్మీకుల్ని కోవిడ్ నుంచి ర‌క్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అయితే తెలుగులో మాత్రం షూటింగులు య‌థాత‌థంగా జ‌రుగుతుండ‌టం కాస్త ఆశ్చ‌ర్యంగానే అనిపిస్తోంది. అంటే లాక్ డౌన్ పెడితేనే షూటింగులు ఆపేస్తామ‌నే సంకేతాల్ని ఇండైరెక్ట్ గా డ‌తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ప్ర‌భుత్వానికి చెబుతున్నారా? అనే కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవ‌ల సెట్లో కోవిడ్ పాజిటివ్ బ‌య‌ట‌ప‌డ‌డంతో ప‌లు పెద్ద సినిమాల షూటింగులు నిలిచిపోయిన సంగ‌తిని గుర్తుంచుకోవాలి. మొండి ధైర్యం చేసి సినిమాలు చేస్తున్న‌వారంతా.. వారు త‌మ నిర్మాత కు ఆర్థిక న‌ష్టాల్ని త‌గ్గించేందుకు చేస్తున్న సాయ‌మ‌నే అనుకోవాలి. కోవిడ్ ఇక అదుపుత‌ప్పింది అనుకుంటే నిలిపేస్తారేమో!