Begin typing your search above and press return to search.

షాక్ : దిల్ రాజు ఆఫీస్ మీద ఐటి దాడులు

By:  Tupaki Desk   |   8 May 2019 8:12 AM GMT
షాక్ : దిల్ రాజు ఆఫీస్ మీద ఐటి దాడులు
X
రేపు విడుదల కానున్న మహర్షి గురించి ఫ్యాన్స్ తో పాటు ముగ్గురు నిర్మాతల్లో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా అధికంగా భారం మోసిన దిల్ రాజు అంచనాలు నమ్మకాలు దీని మీద మాములుగా లేవు. సుమారు 95 కోట్ల దాకా కేవలం థియేట్రికల్ బిజినెసే భారీ స్థాయిలో జరిగిందట. అందువల్లే తెలంగాణాలో ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని మరీ ధియేటర్ ఓనర్లు రేట్లు పెంచి అమ్ముతున్నారని ఇప్పటికే టాక్ ఉంది.

ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితం దిల్ రాజు ఆఫీసుల మీద ఐటి అధికారులు రైడ్ చేశారని తెలిసింది. ఇలాంటివి ముందే చెప్పి చేయరు కాబట్టి హటాత్తుగా శ్రీనగర్ కాలనీ బంజారా హిల్స్ లో ఉన్న ఆఫీస్ కు వెళ్లి లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరించారని తెలిసింది. ఇది కేవలం దిల్ రాజుకే పరిమితమా లేక మిగిలిన పార్ట్ నర్స్ అశ్విని దత్ పివిపి ఆఫీసులకు సైతం వెళ్తారా అనే క్లారిటి ఇంకా రావాల్సి ఉంది.

మొత్తం బిజినెస్ చూసుకుంటే హక్కులన్నీ కలిపి 150 కోట్ల దాకా జరిపినట్టు చెప్పబడుతున్న మహర్షికి ఈ వీకెండ్ చాలా ముఖ్యం. నాలుగు రోజులు కాబట్టి వీలైనంత అధిక మొత్తంలో వసూళ్లు రాబట్టి రికార్డుల పర్వానికి తెరతీయాలని అభిమానుల కోరిక. ఇప్పుడీ ఐటి దాడుల వల్ల ఓపెనింగ్స్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు కాని టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచిన మహర్షి నిర్మాతల మీద ఆదాయపు పన్ను శాఖ అధికారుల కన్ను పడటంలో ఆశ్చర్యం ఏమి లేదు. అధికారిక ధృవీకరణ ఇంకా రావలసి ఉంది