Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో ఐటీ రైడ్స్ కలకలం

By:  Tupaki Desk   |   18 Jan 2023 10:54 AM GMT
టాలీవుడ్‌లో ఐటీ రైడ్స్ కలకలం
X
ఈరోజు ఉదయం టాలీవుడ్‌ను ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ టార్గెట్ చేసిందని వార్తలు తెరమీదకు వచ్చిన తర్వాత అందరూ మైత్రి మూవీ మేకర్ సంస్థ మీద ఐడి దాడులు చేస్తుందని భావించారు. ఎందుకంటే ఇటీవల వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య... లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ మీద ఐటీ దాడులు జరిగి ఉండవచ్చని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ మీద ఐటీ దాడులు జరిగినట్లుగా వెల్లడవుతోంది.

వాస్తవానికి ఈ బ్యానర్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలేవి ఈ మధ్యకాలంలో రావడం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌కి హారిక హాసిని సంస్థ ఒక డమ్మీ బ్యానర్ల ప్రస్తుతం వ్యవహరిస్తోంది. దీనికి నిర్మాతగా నాగవంశీ వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఉదయం సారథి స్టూడియోస్‌లో ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఉన్న నాగవంశీ దగ్గరకు వెళ్లిన ఐటీ శాఖ అధికారులు ఆయనను పికప్ చేసుకుని ఆయన నివాసానికి తీసుకువెళ్లి సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది.

మరొక బృందం హారిక హాసిని క్రియేషన్స్ ఆఫీస్ మీద రైడ్స్‌ జరిపినట్లుగా చెబుతున్నారు. అయితే హారిక హాసిని క్రియేషన్స్ మీద ఐటీ దాడులు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ సంస్థ మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు కానీ... ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి అదే సంస్థ మీద ఐటీ శాఖ దాడులు చేయడమవుతోంది. అయితే వాస్తవానికి హారిక హాసిని క్రియేషన్స్ సంస్థకు తెలంగాణలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ గ్రూపుగా ఉన్న మై హోమ్ సంస్థకు మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెబుతున్నారు.

అలాగే నాగ వంశీ బ్యానర్ లోని కొంతమంది వ్యక్తులకు ఫోనిక్స్ గ్రూప్‌తో కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెబుతున్నారు. బహుశా ఆ వ్యాపార లావాదేవీల వల్ల సంస్థపై దాడులు జరుగుతున్నాయా లేక సినిమాల నిర్మాణం విషయంలోనే దాడులు జరుగుతున్నాయా అనే విషయం మీద క్లారిటీ లేదు. ప్రస్తుతానికి నాగవంశీ సహా హారిక హాసిని క్రియేషన్స్ సంస్థకు చెందిన ప్రతినిధుల ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి. ఈ రోజు సాయంత్రానికి ఈ అంశం పైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.