Begin typing your search above and press return to search.

ఓటీటీని ఆపేయ‌గ‌ల‌మ‌నేది భ్ర‌మ.. ఇదో ఉపాధి కల్ప‌త‌రువు!

By:  Tupaki Desk   |   19 July 2021 8:30 AM GMT
ఓటీటీని ఆపేయ‌గ‌ల‌మ‌నేది భ్ర‌మ.. ఇదో ఉపాధి కల్ప‌త‌రువు!
X
అనుకోకుండా వ‌చ్చి పాపుల‌రై అదే ఇప్పుడు సేవియ‌ర్ గా మారిపోయింది అంటూ ఓటీటీల‌కు కితాబిచ్చారు అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు. చాలా మందికి ఇది పెద్ద అడ్వాంటేజ్.. క‌ళ‌ను ర‌క్షించే వేదిక ఇది.. అంటూ ఆయ‌న ఓటీటీల‌పై త‌న అవిభాజ్య‌మైన ప్రేమ‌ను కురిపించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

డి.సురేష్ బాబు త‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఇండ‌స్ట్రీ లో బిజినెస్ మారుతున్న ఫేజ్ గురించి ప్ర‌స్థావించారు. టెక్నాల‌జీ అడ్వాన్స్ మెంట్ పై విశ్లేషిస్తూ ఆయ‌న ప‌రిశ్ర‌మ‌కు ప‌లు విలువైన సూచ‌న‌లు చేశారు. టాలీవుడ్ లో ప్ర‌తియేటా తెర‌కెక్కే 150 సినిమాలే కాదు.. బోలెడ‌న్ని అవ‌కాశాలు పెరుగుతున్నాయి. డిజిట‌ల్ సిరీస్ లు.. వెబ్ సిరీస్ లు పెరుగుతున్నాయి. ప‌ని చేసుకునే కార్మికుల‌కు వీటివ‌ల్ల‌ అవ‌కాశాలు పెరుగుతాయి. న‌టీన‌టుల‌కు టెక్నీషియ‌న్ల‌కు ప‌ని అవ‌కాశం పెరుగుతుంది. అలాగే నిర్మాత‌ల‌కు ఇవి చాలా ఉప‌యుక్తం.. ఓటీటీల‌తో చాలా మేలు జ‌రుగుతోంది... అని తెలిపారు. ఇక ఓటీటీల‌తో పాటు మ‌నుగ‌డ సాగించ‌గ‌లిగేది సూప‌ర్ స్క్రీన్లు మాత్ర‌మేన‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌తి గేటెడ్ క‌మ్యూనిటీలో ఇక‌పై మినీ స్క్రీన్లు అల్ట్రా సౌండ్ సిస్ట‌మ్ తో అందుబాటులోకి వ‌చ్చేస్తాయ‌ని సినిమా వీక్ష‌ణ విధానం అమాంతం మారిపోతుంద‌ని సురేష్ బాబు తెలిపారు బ్యాంకుల్లో బిజినెస్ మోడ‌ల్ మారుతోంది. అక్క‌డికి క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు విధిగా సినిమా స్క్రీన్ల‌ను ఏర్పాటు చేస్తార‌ని ముందస్తు ఆలోచ‌న‌ను ఆవిష్క‌రించారు.

ఇక ఓటీటీల‌ను స‌మ‌ర్థించినా కానీ ఎగ్జిబిష‌న్ రంగం గురించి ఆయ‌నేమీ త‌క్కువ చేసి మాట్లాడ‌లేదు. ఈ రంగంలో క‌ష్టాల‌ను ఆయ‌న ఏక‌రువు పెట్టారు. అస‌లు ప్ర‌భుత్వాల నుంచి ఎలాంటి స‌హాయం లేద‌ని నిర్వేదం వ్య‌క్తం చేశారు. 15 నెల‌లుగా మూత‌ప‌డి ఉన్న థియేట‌ర్ల‌కు ఎగ్జిబిట‌ర్ల‌కు ప్ర‌భుత్వాల సాయం చాలా అవ‌స‌రం అన్నారు.. టిక్కెట్ రేట్లు పెంచాల‌ని అడిగాం.. క‌రెంట్ బిల్స్ ప‌న్నులు త‌గ్గించాల‌ని కోరాం. కానీ స్పంద‌న లేదు.. అని తెలిపారు.

ఇప్ప‌టికే సింగిల్ స్క్రీన్లు ఫ్యాష‌న్ తో న‌డిపేవాళ్లే. క‌మ‌ర్షియ‌ల్ చేయాల‌నుకుంటే ఎప్పుడో బిజినెస్ చేసేవారు. థియేట‌ర్ల‌న్నీ నిజానికి ప్రైమ్ ఏరియాలో రోడ్స్ ఉన్న‌ ఏరియాలో ఉంటాయి. కానీ థియేట‌ర్ య‌జ‌మానులు వీటిని ఫ్యాష‌న్ కోసం న‌డిపిస్తున్నారు త‌ప్ప వేరే ప్ర‌యోజ‌నం ఏదీ లేదు.. అక్క‌డ ఫ్లాట్లు క‌ట్టి అమ్మేయొచ్చు.. నిజానికి ఇంత‌కుముందు తెలుగు రాష్ట్రాల్లో 3000 థియేట‌ర్లు ఉండేవి. ఏపీ తెలంగాణ‌లో ఇప్పుడు 1750 మాత్ర‌మే ఉన్నాయి. మునుముందు ఈ సంఖ్య త‌గ్గిపోయేందుకు ఆస్కారం ఉంది. ఇక‌పై హై క్వాలిటీ థియేట‌ర్లు మాత్ర‌మే స‌ర్వైవ్ అవ‌తాయి. సూప‌ర్ స్క్రీన్లు మాత్ర‌మే ర‌న్ అవుతాయి. త‌క్కువ‌ క్వాలిటీ థియేట‌ర్లు ఉండ‌వు.. అలాగే థియేట‌ర్ల‌తో పాటు ఓటీటీలు సైమ‌ల్టేనియ‌స్ గా ముందుకు సాగుతాయి... అని త‌న‌దైన శైలిలో విశ్లేషించారు.

తాము భాగ‌స్వామ్యంలో నిర్మించిన నారప్ప చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేయ‌డానికి కార‌ణం చెబుతూ.. క‌రోనా భ‌యాలతోనే ఈ నిర్ణ‌యం అని అన్నారు. ఈ సినిమాను కలైపుతి యస్‌. థాను తో కలిసి నిర్మించాము. ఈ ఏడాది ఏప్రిల్ లో ధనుష్ `కర్ణన్‌` సినిమాను థానుగారు విడుదల చేశారు. విడుదలైన మొదటివారంలో 100 శాతం ఆక్యూపెన్సీతో ఉన్న థియేటర్స్‌ కోవిడ్‌ కారణంగా 50 శాతానికి పడిపోయాయి. ఆ నెక్ట్స్‌ వెంటనే సినిమాను తీసేశారు. దానివల్ల థానుగారు దాదాపు 10 కోట్లు నష్టపోయారు. అందుకని ఆయన ఆందోళనకు గురయ్యారు. ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనుకున్నప్పుడు కోవిడ్ ఉదృతీ చాలా ఎక్కువగా ఉంది. థియేటర్స్‌ ఎప్పుడు రీ ఓపెన్‌ అవుతాయో తెలియదు. ఒకవేళ ఓపెన్‌ అయినా ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంటుందో తెలియదు. ఇన్ని కారణాల వల్ల నారప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తుంది... అని తెలిపారు.