Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్- విజ‌య్ అభిమానుల మ‌ధ్య సోష‌ల్ యుద్ద‌మే

By:  Tupaki Desk   |   1 Jan 2022 2:30 AM GMT
ఎన్టీఆర్- విజ‌య్ అభిమానుల మ‌ధ్య  సోష‌ల్  యుద్ద‌మే
X
RRR ప్ర‌మోష‌న్ ముంబై నుంచి చెన్నైకి షిప్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ముంబై త‌ర‌హాలోనే చెన్నైలోనూ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వ‌హించారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్..ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఇప్పుడు కోలీవుడ్ ఛాన‌ల్స్ అన్నింటిని చుట్టేస్తున్నారు. దీనిలో భాంగంగా కోలీవుడ్ స్టార్ టీవీలో ఈ ముగ్గురి ఇంట‌ర్వ్యూ జ‌రిగింది. ఇందులో త‌మిళ్ హీరో విజ‌య్ ఫోటో చూపించి అత‌ని గురించి మీ అభిప్రాయం ఏంట‌ని ఎన్టీఆర్ అని అడిగారు. దానికి తార‌క్ పాజిటివ్ గా స్పందించారు. `` సూప‌ర్ స్టార్ ... మంచి డాన్స‌ర్..ల‌వ్లీ ప‌ర్స‌న్...మంచి ఫ్రెండ్.. అంత‌కు మించి గైడ్ లాంటి వారు.

మంచి మాన‌వ‌తా వాది`` అన్నారు. ఇంత‌లో యాంక‌ర్ విజ‌య్ పై అభిమానం చూపించిన వారు ఎవ‌రు? ఉంటారంటూ న‌వ్వేసింది. దానికి తార‌క్ కూడా సంతోషం వ్య‌క్తం చేసాడు. ఈ వీడియో క్లిప్ ని విజ‌య్ టెలివిజన్ ట్విట‌ర్లో పోస్ట్ చేసింది. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ ప‌క్క‌న చ‌ర‌ణ్..రాఝ‌మౌళి కూడా ఉన్నారు. వారిద్ద‌రు విజ‌య్ గురించి మాట్లాడ‌లేదు. కేవలం తార‌క్ ని మాత్ర‌మే కెలికారు. మ‌రి దీని వెనుక స్టా గ్రూప్ స్ర్టాట‌జీ ఏంట‌న్న‌ది తాజాగా లీకైంది. ఎన్టీఆర్- విజ‌య్ అభిమానుల మ‌ధ్య అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో పెద్ద యుద్ద‌మే జ‌రిగింది. డాన్సు విష‌యంలో మాహీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఇద్ద‌రి హీరోల అభిమానులు దూషించుకున్నారు.

అదీ `య‌మ‌దొంగ‌` సినిమా విష‌యంలోనే. తార‌క్ -రాజ‌మౌళి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `య‌మ‌దొంగ` పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో తార‌క్ డాన్సు ప్ర‌త్యేక ఆక‌ర్ణ‌గా నిలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని కోలీవుడ్ లో విజ‌య్ హీరోగా రీమేక్ అయింది. దీంతో ఇద్ద‌రి హీరోల మ‌ధ్య డాన్సు వ్య‌త్యాసం క‌నిపించింది. ఇక్క‌డే అభిమానుల మ‌ధ్య వివాదం మొద‌లైంది. స‌రిగ్గా ఇదే పాయింట్ ని బేస్ చేసుకుని స్టార్ గ్రూప్ నేడు తార‌క్ నోట‌నే విజ‌య్ గురించి చెప్పించ‌డం గ‌మ‌నార్హం.