Begin typing your search above and press return to search.
తెలుగు ప్రేక్షకులు అలాంటి చిత్రాలను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది: రాజ్-డీకే
By: Tupaki Desk | 15 May 2021 9:00 PM ISTతెలుగులో 'డీ ఫర్ దోపిడీ' చిత్రాన్ని నిర్మించిన దర్శకద్వయం రాజ్ & డీకే(రాజ్ నిడిమోరు - కృష్ణ డీకే).. ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. 'గో గోవా గాన్' 'స్త్రీ' వంటి సినిమాలతో పాటుగా 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ క్రమంలో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ‘డీ2ఆర్ ఇండీ’ అనే బ్యానర్ ని ఏర్పాటు చేసి, తొలి ప్రయత్నంగా ''సినిమా బండి'' అనే ఇండిపెండెంట్ తెలుగు ఫిల్మ్ నిర్మించారు. కొత్త దర్శకుడు ప్రవీణ్ కందిరేగుల తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా విడుదలై పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో నిర్మాతలు రాజ్ అండ్ డీకే ఆనందం వ్యక్తం చేశారు.
'సినిమా బండి' చిత్రానికి అంచనాలకు మించి అద్భుతమైన స్పందన లభిస్తోందని.. విశ్లేషకులు ప్రేక్షకులు అందరూ బాగుందంటున్నారని రాజ్ & డీకే తెలిపారు. ''పాన్ ఇండియన్ స్థాయిలో చక్కటి ఆదరణ లభిస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు సైతం సినిమా చూసి ప్రశంసిస్తున్నారు. మంచి సినిమా చేశారంటూ పల్లెటూళ్ల నుంచి కొందరు మెసేజ్ చేసి అభినందిస్తున్నారు'' అన్నారు. సినిమాకు పనిచేసిన వారందరూ కొత్తవాళ్లేనని.. సినిమాకు వస్తున్న ఆదరణ చూసి వారంతా ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నారని దర్శకద్వయం చెప్పుకొచ్చారు.
''దర్శకుడు ప్రవీణ్ - రచయిత వసంత్ తో పాటు పది మంది వరకు కొత్తవాళ్లు ఈ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ప్రవీణ్ ఈ సినిమాను చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఎంజాయబుల్ సినిమా చేయొచ్చని ప్రవీణ్ కథ చెప్పినప్పుడే అనిపించింది. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. ప్రవీణ్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ నచ్చి అతడిని దర్శకుడిగా పరిచయం చేశాం. స్టార్స్ ని కాకుండా అతడి షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన వారినే ఈ సినిమాలో తీసుకున్నాం. నటీనటులందరూ సహజంగా నటించారు''
''ప్రొడ్యూసర్స్ గా సినిమాకి డబ్బులు పెట్టడమే కాకుండా స్ర్కిప్టింగ్ నుంచి ఎడిటింగ్ వరకు ప్రతి విభాగంలో మా ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. ఈ సినిమాకు మేము ప్రవీణ్ - వసంత్ కలిసి చాలా రోజులు స్ర్కిప్ట్ డెవలప్ చేశాం. సినిమా బాగా రావడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చాం. తొలినాళ్లలో ఎవరి ప్రోత్సాహం లేకపోయినా ఎన్నో కష్టాలు పడుతూ సినిమాలు తీశాం. వాటిని దృష్టిలో పెట్టుకొని కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే డీ2ఆర్ ఇండీ బ్యానర్ ని స్థాపించాం. ఈ బ్యానర్ పై యునిక్ కథాంశాలతో కూడిన ఇండిపెండెంట్ సినిమాలు తీస్తాం. లాభాల గురించి ఆలోచించకుండా మంచి కథల్ని తెరకెక్కించాలన్నదే మా ఉద్దేశం''
''థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. 2019లోనే షూటింగ్ పూర్తయింది. అప్పట్లో ఓటీటీలో విడుదల చేయాలని ఆలోచన లేదు. సినిమా పూర్తి చేసిన తర్వాత ఏ మీడియం బాగుంటే అందులోనే విడుదల చేయాలని భావించాం. కొత్త కథాంశాలతో కూడిన చిన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది'' అని రాజ్ & డీకే చెప్పారు.
'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ జూన్ లో విడుదల కానుంది. త్వరలో ట్రైలర్ విడుదలచేయబోతున్నాం. ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో ఓ వెబ్ సిరీస్ చేసే ప్లాన్స్ లో ఉన్నాం. వాటితో పాటు మరికొన్ని వెబ్ సిరీసులు, సినిమాలు షూటింగ్, స్ర్కిప్టింగ్ దశలో ఉన్నాయి. దర్శకులుగా తెలుగు సినిమాలు చేయాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీకి వచ్చాం. టాలీవుడ్ హీరోలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. టైమ్ వస్తే తప్పకుండా తెలుగులో సినిమా చేస్తామని దర్శకద్వయం రాజ్ - డీకే తెలిపారు.