Begin typing your search above and press return to search.
కలెక్షన్ల కాకి లెక్కలు మెడకు చుట్టుకునేలా ఉన్నాయే!
By: Tupaki Desk | 8 Feb 2020 6:30 PM ISTఫేక్ కలెక్షన్లు. ఈమధ్య కాలంలో తెలుగునాట కరోనా వైరస్ తర్వాత ఎక్కువగా చర్చనీయాంశం అయిన విషయమే ఫేక్ కలెక్షన్లు. ఆ కాకిలెక్కలు చూసి చిత్రగుప్తుడు కూడా షేక్ అయి ఉంటాడని చెప్పకతప్పదని చెప్పకతప్పదు! పదాన్ని రిపీట్ చేస్తేనే కొంతమంది జనాలకు చిరాకు పుడుతుంది. ఇక కాకిలెక్కలను అదేపనిగా ప్రచారం చేస్తూ అవే నిజమని నమ్మిస్తూ ఉంటే ప్రేక్షకులకు చిరాకు పుట్టకుండా ఉంటుందా? అందుకే ఇప్పటికే చాలామంది నాన్ - బాహుబలి రికార్డు 'రంగస్థలం' పేరిట ఉందనే నమ్ముతున్నారు.
ఇదంతా ఒక ఎత్తైతే.. ఈ కలెక్షన్ల కాకి లెక్కలు దర్శక నిర్మాతలు.. హీరోల మెడకు చుట్టుకునేలా ఉన్నాయని అంటున్నారు. నిన్న తమిళనాడులో నిర్మాత.. హీరోలపై జరిగిన ఐటీ దాడుల వ్యవహారం ఒక హాట్ టాపిక్ గా మారింది. ఐటీ వారు దాడులు చేసిన సమయంలో సినిమాల కలెక్షన్స్ పోస్టర్లు.. ప్రెస్ మీట్లలో హీరోలు నిర్మాతలు చెప్పుకున్న ఘనమైన గ్రాసు మొత్తాలు..రికార్డుల క్లెయిమ్స్ అన్నీ ప్రూఫ్ లు మందుపెట్టి మరీ వీటి సంగతి ఏంటి అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారట. దీంతో ఫిలిం మేకర్లు తెల్లమొహం వేస్తున్నారట.
ఈ హంగామా అంతా చూస్తుంటే మన టాలీవుడ్ లో కూడా దర్శక నిర్మాతలకు.. హీరోలకు కూడా ఈ ఐటీ జింతాత జిత జిత తప్పదని అంటున్నారు. మన సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ గోల ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ పిచ్చలెక్కల దెబ్బకు అసలు కలెక్షన్స్ ఎవరికీ అర్థం కావడం లేదు. గతంలో కనీసం కొందరికైనా నిజం కలెక్షన్స్ తెలిసేవి. ఇప్పుడు ఎక్కువ ఏరియాలలో సొంతవారికే డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ ఉండడంతో వారు హీరోలకు నిర్మాతలకు తగ్గట్టుగా ఫేక్ లెక్కలు చూపించక తప్పడం లేదు.
ఈ ఇన్కమ్ టాక్స్ వారి పుణ్యమా అని కనీసం నిజం లెక్కలు బయటకు వస్తే మంచిది. అప్పుడే నిజమైన హిట్టు ఏదో ఫట్టు ఏదో తెలుస్తుంది. ఇలానే కొంతకాలం కొనసాగితే కలెక్షన్ల లెక్కల కోసం అందరూ ఐటీ డిపార్ట్ మెంట్ పై ఆధార పడాల్సిన పరిస్థితి రావచ్చు.