Begin typing your search above and press return to search.

ఆ రెండు తోపు సినిమాలకు ఇక్కడ పెద్ద పరీక్షే!

By:  Tupaki Desk   |   17 Sep 2022 7:36 AM GMT
ఆ రెండు తోపు సినిమాలకు ఇక్కడ పెద్ద పరీక్షే!
X
తెలుగు సినిమాలు హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా విపరీతంగా ఆడేస్తున్నాయి. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా పలు తెలుగు సినిమాలు వసూళ్ల విషయంలో కుమ్మేసిన విషయం తెల్సిందే. ఒకప్పుడు తెలుగు సినిమాల కంటే మార్కెట్‌ విషయంలో తమిళ సినిమాల పరిధి ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు సినిమాలతో పోటీ పడలేక కుదేలవుతున్నాయి.

బాలీవుడ్‌ సినిమాలతో తెలుగు సినిమాలు పోటీ పడుతున్న ఈ సమయంలో తమిళ సినిమాలు మాత్రం తెలుగు లో మినిమంగా ఆడేందుకు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి. వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమిళ చిత్రాలు పొన్నియిన్ సెల్వన్ పార్ట్‌ 1 మరియు ధనుష్ నటించిన నానే వరువన్ సినిమాలు తెలుగు లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యాయి.

అక్టోబర్ 30వ తారీకున రాబోతున్న మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పొన్నియన్‌ సెల్వన్‌ తమిళనాట భారీ అంచనాలను కలిగి ఉంది. తమిళ బాహుబలి అంటూ అక్కడి వారు ఈ సినిమా ను గురించి తెగ ప్రచారం చేస్తున్నారు. కానీ తెలుగు లో మాత్రం ఇప్పటి వరకు ఆ రేంజ్ బజ్ క్రియేట్‌ అవ్వలేదు. అయినా కూడా విడుదల తర్వాత కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని బిజినెస్ బాగానే అయ్యిందని సమాచారం.

ఇక పొన్నియన్‌ సెల్వన్ సినిమాకు కాస్త అటు ఇటు లేదా అదే రోజున ధనుష్ నటించిన నానే వరువన్‌ ను తెలుగు లో నేనే వస్తున్నా అనే టైటిల్‌ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు సమర్పిస్తున్న కారణంగా అంచనాలు ఆసక్తి ఒకింత పెరిగాయి.. కానీ ప్రేక్షకుల్లో ఇంకా బజ్ భారీ గా అయితే క్రియేట్‌ అవ్వలేదనే చెప్పాలి.

ఈ రెండు కూడా అక్టోబర్ చివరి వారంలో విడుదల కాబోతున్నాయి. కనుక తెలుగు లో రూపొందిన భారీ సినిమాలు వాటికి పోటీ లేవనే చెప్పాలి. మొదటి వారంలోనే విడుదల కాబోతున్న గాడ్‌ ఫాదర్‌ మరియు ది ఘోస్ట్‌ సినిమాలు హిట్‌ అయినా కూడా చివరి వారం వరకు జోరు తగ్గే అవకాశం ఉంది. కనుక ఈ రెండు అరవ తోపు సినిమాలు హిట్ టాక్‌ దక్కించుకుంటే తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్‌ వసూళ్లను దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ పరీక్ష ను ఆ రెండు తమిళ సినిమాలు ఎలా ఛేదిస్తాయి అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.