Begin typing your search above and press return to search.

మెరుపులు విరుపుల‌తో క‌వ్వించ‌డంలో స్పెష‌లిస్ట్‌

By:  Tupaki Desk   |   10 May 2021 2:00 PM IST
మెరుపులు విరుపుల‌తో క‌వ్వించ‌డంలో స్పెష‌లిస్ట్‌
X
అందానికి అందం.. క‌వ్వింత త‌న‌లో తక్కువ కాద‌ని ప్రూవ్ చేస్తోంది ఐశ్వ‌ర్య మీన‌న్. ఈ భామ లేటెస్ట్ షిమ్మ‌రీ ఫోటోషూట్ అందుకు సాక్ష్యం. ఐశ్వ‌ర్య మిరుమిట్లు గొలిపే అందాలు ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. బ్లాక్ మిరుమిట్ల డిజైన‌ర్ దుస్తుల్లో ఐశ్వ‌ర్య అందానికే అందం అన్న చందంగా మెరుపులు మెరిపించింది. ఈ ఫోటోల్ని యువ‌త‌రం వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

ప‌దేళ్ల‌క్రితం చాక్లెట్ బోయ్ సిద్ధార్థ్ స‌ర‌స‌న ల‌వ్ ఫెయిల్యూర్ చిత్రంలో న‌టించిన ఐశ్వ‌ర్యకు ఒక ర‌కంగా ల‌క్ చిక్క‌లేదు. ఆ త‌ర్వాత త‌మిళం క‌న్న‌డ ‌లో కొంత‌కాలం కెరీర్ సాగించింది. ఇప్పుడు మ‌రోసారి టాలీవుడ్ లో అడుగుపెడుతోంది.

క్రాక్ తో ట్రాక్ లో ప‌డిన మాస్ మ‌హారాజా ర‌వితేజ 68వ సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇందులో వేరొక నాయిక‌తో క‌లిసి ర‌వితేజతో ఐశ్వ‌ర్య ఆడిపాడ‌నుంది. త్రినాథ‌రావు న‌క్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ర‌వితేజ‌తో త‌న‌కు జాక్ పాట్ త‌గ‌ల‌గానే ఈసారి నిరూపించుకోవాల‌ని క‌సిగా ఉందిట‌. ఇక ఐశ్వ‌ర్య మ‌రోసారి తెలుగు చిత్ర‌సీమ‌లో వెల‌గాల‌ని క‌ల‌లుగంటోంది. మ‌రి ఆశించిన ఆ ఒక్క హిట్టును మాస్ రాజా ఇస్తాడా లేదా చూడాలి.