Begin typing your search above and press return to search.

స్పై ఆన్ ఫైర్.. ఐశ్వర్య అందాలకు నిఖిల్ ఫిదా

By:  Tupaki Desk   |   21 Jan 2023 3:30 AM GMT
స్పై ఆన్ ఫైర్.. ఐశ్వర్య అందాలకు నిఖిల్ ఫిదా
X
పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా... అన్నట్లుగా హీరోయిన్లందు మల్లు బ్యూటీలు వేరయా.. అనాలేమో! ఒక రకంగా మలయాళ భామలు.. దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో తమకంటూ సపరేట్ క్రేజ్ దక్కించుకునే పనిలో ఉన్నారు. అలాంటి వారిలో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు. ఐశ్వర్య మీనన్ కుటుంబం కేరళకు చెందినదే.

అయినా ఆమె తల్లిదండ్రుల ఉద్యోగ రిత్యా.. తమిళనాడులోనే పుట్టి పెరిగింది. ముందుగా తమిళ సినీ పరిశ్రమ ద్వారా ఆమె హీరోయిన్గా నటించిన తమిళ సినిమాని తెలుగులో కూడా లవ్ ఫెయిల్యూర్ పేరుతో రిలీజ్ చేశారు.

అయితే ఎందుకో ఆమెకు తెలుగు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత ఆమె తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు ఏవి తెలుగులో రిలీజ్ కాలేదు. దీనితో తెలుగు అవకాశాలు కూడా రాకుండా పోయాయి. అయితే అలాంటి ఆమెకు ఏకంగా తెలుగు నుంచి రూపొందుతున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్టులోనే అవకాశం దక్కింది.

నిఖిల్ సిద్ధార్థ హీరోగా తెరకెక్కుతున్న స్పై అనే సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అసలే మలయాళ భామ... ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా లాంచ్ అవుతుంది. ఇంకా ఆమె ఎందుకు వెనక్కి తగ్గుతుంది. ఎప్పటికప్పుడు తన అందాలు ఆరబోసేందుకు ఆసక్తి చూపిస్తూ వస్తోంది.

తాజాగా ఆమె ఒక రెడ్ టాప్ బ్లాక్ జీన్స్ ధరించి.. కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎక్కడో ఒక పురాతన కట్టడాల దగ్గర ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్లు చేస్తున్నారు.

కొంతమంది మీరు భలే క్యూట్గా ఉన్నారని కామెంట్లు చేస్తుంటే.. మరి కొంత మంది హద్దులు మీరి కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె చేసిన పోస్ట్కి యాక్టర్ నిఖిల్ చేసిన కామెంటు ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ కలిసి స్పై సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో మంచి ఫైర్ మీద ఉంది అంటూ నిఖిల్ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.