Begin typing your search above and press return to search.

ప‌దేళ్ల‌యినా ఎద‌గ‌లేక‌పోయిన మ‌ల్లూ బ్యూటీ

By:  Tupaki Desk   |   9 April 2021 2:00 PM IST
ప‌దేళ్ల‌యినా ఎద‌గ‌లేక‌పోయిన మ‌ల్లూ బ్యూటీ
X
దాదాపు ప‌దేళ్ల‌ క్రిత‌మే చాక్లెట్ బోయ్ సిద్ధార్థ్ స‌ర‌స‌న ల‌వ్ ఫెయిల్యూర్ అనే చిత్రంతో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మైంది ఐశ్వ‌ర్య‌మీన‌న్. ఈ మ‌ల్లూ బ్యూటీ అంద‌చందాల‌కు బోయ్స్ ఫిదా అయ్యారు. కానీ ఏం లాభం? త‌న‌కు ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు.

ఆ త‌ర్వాత త‌మిళం క‌న్న‌డ ‌లో కొంత‌కాలం కాలక్షేపం చేసింది. ఇప్పుడు మ‌రోసారి టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ 68వ సినిమాలో అవ‌కాశం అందుకుంది. మ‌రో క‌థానాయిక‌తో పాటు ఈ చిత్రంలో న‌టించ‌నుంది. త్రినాథ‌రావు న‌క్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.

ఇటీవ‌ల ఐశ్వర్య మీనన్ సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ చూపిస్తోంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఓ స్పెష‌ల్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అలా బీచ్ లో స్వేచ్ఛ‌గా ఎంతో ప్లెజెంట్ గా క‌నిపిస్తోంది. గ్లామ‌ర్ ఎలివేష‌న్ కి ఏమాత్రం అడ్డు చెప్ప‌ని భామ‌గా ఇప్ప‌టికే ఇన్ స్టాలో ఫీల‌ర్స్ వ‌దిలిన ఐశ్వ‌ర్య మీన‌న్ త‌దుప‌రి పెద్ద హీరోల‌తో ఆఫ‌ర్ల కోసం వేచి చూస్తోంద‌ట‌. ర‌వితేజ‌తో త‌న‌కు జాక్ పాట్ త‌గ‌ల‌గానే ఎగిరి గంతేసింద‌ని ఇన్ సైడ్ స‌ర్కిల్స్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.