Begin typing your search above and press return to search.
బోయ్స్ కలల్లో బాక్సింగ్ ఆడేస్తున్న బ్యూటీ
By: Tupaki Desk | 6 Jan 2022 8:00 AM ISTఐశ్వర్య మీనన్ పరిచయం అవసరం లేదు. దశాబ్ధ కాలంగా సౌత్ లో ఈ బ్యూటీ కథానాయికగా నటిస్తోంది. పదేళ్ల క్రితమే చాక్లెట్ బోయ్ సిద్ధార్థ్ సరసన లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది ఐశ్వర్యమీనన్. ఈ మల్లూ బ్యూటీ అందచందాలకు బోయ్స్ ఫిదా అయ్యారు. కానీ ఆశించిన విజయం దక్కకపోవడంతో కెరీర్ పరంగా బిజీ కాలేకపోయింది. ఆ తర్వాత తమిళం కన్నడ లో కొంతకాలం కాలక్షేపం చేసింది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ 69వ సినిమాలో అవకాశం అందుకుంది. మరో కథానాయికతో పాటు ఈ చిత్రంలో నటించనుంది. త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాల్లో స్పీడ్ చూపిస్తోంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఓ స్పెషల్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. గ్లామర్ ఎలివేషన్ కి ఏమాత్రం అడ్డు చెప్పని భామగా ఇప్పటికే ఇన్ స్టాలో పాపులరైన ఐశ్వర్య మీనన్ బ్లాక్ స్పోర్ట్ డ్రెస్.. బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి జిమ్ లో ఫోజులిచ్చిందిలా. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. తదుపరి పెద్ద హీరోలతో ఆఫర్ల కోసం వేచి చూస్తోందట. రవితేజతో తనకు జాక్ పాట్ తగలగానే ఎగిరి గంతేసి భవిష్యత్ గురించి పెద్ద కలలు కంటోందిట.
డిసెంబర్ 31 మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అనంతరం ఐశ్వర్య వరుస పోస్టింగులతో అభిమానులకు టచ్ లో ఉంది. కొత్త సంవత్సరం కొత్త కాంతుల్ని నింపాలని ఆకాంక్షించిన ఈ బ్యూటీకి 2022 తీపి జ్ఞాపకంగా మిగులుతుందనే భావిద్దాం.