Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆ చేప‌క‌ళ్ల వ‌ల‌ల‌కు చిక్కితే అంతేగా

By:  Tupaki Desk   |   15 May 2021 2:01 PM IST
ఫోటో స్టోరి: ఆ చేప‌క‌ళ్ల వ‌ల‌ల‌కు చిక్కితే అంతేగా
X
ఐశ్వ‌ర్య మీన‌న్ .. ప‌దేళ్లుగా సౌత్ ఇండ‌స్ట్రీస్ కి సుప‌రిచిత‌మైన పేరు. మ‌ల‌యాళం- తెలుగులో సినిమాలు చేసింది. డికేడ్ బ్యాక్ ల‌వ‌ర్ బోయ్ సిద్ధార్థ్ స‌ర‌స‌న ల‌వ్ ఫెయిల్యూర్ చిత్రంలో న‌టించిన ఐశ్వ‌ర్యకు ఆరంభ‌మే విజ‌యం ద‌క్క‌క‌పోవ‌డం మైన‌స్ అయ్యింది. త‌మిళం క‌న్న‌డ ‌ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ప్ర‌య‌త్నించినా.. ఆశించిన‌ది ద‌క్క‌లేదు.

ప్ర‌స్తుతం మ‌రోసారి తెలుగు చిత్రసీమ‌లో అవ‌కాశం అందుకుని అదృష్టం ప‌రీక్షించుకోబోతోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న ఆయ‌న కెరీర్ 68వ చిత్రంలో న‌టించేందుకు ఐశ్వ‌ర్య మీన‌న్ సంత‌కం చేసింది. త్రినాథ‌రావు న‌క్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. క్రాక్ తో ట్రాక్ లో ప‌డిన ర‌వితేజ రెట్టించిన ఉత్సాహంతో దూకుడు మీదున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి టైమ్ లో హిట్టు ప‌డితే అది ర‌వితేజ‌కే కాదు.. ఐశ్వ‌ర్య మీన‌న్ కి పెద్ద ప్ల‌స్ అవుతుంది.

మ‌రోవైపు తెలుగు ఆడియెన్ కి క‌నెక్ట‌య్యేందుకు రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌ను ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తున్న ఐశ్వ‌ర్య‌.. తాజాగా మ‌రో స్పెష‌ల్ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో మీన‌నేత్రినే త‌ల‌పిస్తోంది మీన‌న్. ఆ చేప‌క‌ళ్ల అందంతో మురిపిస్తూ.. అలా వైట్ ష‌ర్ట్ ని నాభి దిగువ‌గా ముడివేసిన తీరు ఆస‌క్తిక‌రం. ముఖ్యంగా ఆ మీన నేత్రాల‌తో కుర్ర‌కారుకు వ‌ల‌లు వేస్తున్న తీరు యూత్ లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆమె వ‌ల‌కు చిక్కితే అంతేగా!అంటూ బోయ్స్ ప‌రేషాన్ అవుతున్నారు. మొత్తానికి ఒక్క ఫోటోతో మీన‌న్ పెద్ద ఇంప్రెష‌న్ కొట్టేసింది.