Begin typing your search above and press return to search.

కుర్రాడితో కుమారి డీలింగ్స్ సెట్

By:  Tupaki Desk   |   24 April 2016 3:30 PM GMT
కుర్రాడితో కుమారి డీలింగ్స్ సెట్
X
సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన కుమారి 21ఎఫ్ మూవీ.. ఇటు రాజ్ తరుణ్ కు హ్యాట్రిక్ ను అందించగా, అటు హేభా పటేల్ కు ఫస్ట్ సక్సెస్ తో పాటు క్రేజ్ ని కూడా సంపాదించిపెట్టింది. వీళ్లిద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవడంతో.. అదే జోరుతో మరో మూవీలో కూడా జంటగా కనిపించారు వీరిద్దరూ. ఈడోరకం ఆడోరకం మూవీలో రాజ్ తరుణ్ - హేభా పటేల్ ల జంట బాగానే అలరించారు.

అయితే.. ఈ మూవీ షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య తేడాలొచ్చాయనే వార్తలొచ్చాయి. ఇవన్నీ నిజమేనని ఈడోరకం ఆడోరకం ప్రమోషన్స్ లో తేలిపోయింది. కనీసం రాజ్ తరుణ్ పక్కన నుంచోడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి కూడా ఇష్టపడలేదు హేభా పటేల్. కానీ ఇప్పుడు అన్నీ సెట్ అయినట్లుగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య పొరపొచ్చాలని సరిదిద్దేందుకు ఓ యంగ్ చేసిన మధ్యవర్తిత్వం బాగానే వర్కవుట్ అయిందని అంటున్నారు.

ఈడో రకం ఆడో రకం సక్సెస్ మీట్ లో రాజ్ తరుణ్ - హేభాపటేల్ కలిసి సందడి చేయడం కనిపించారు. రాసుకుని పూసుకుని తిరగడమే కాదు.. చక్కగా బోలెడన్ని కబుర్లు కూడా చెప్పేసుకున్నారు. దీంతో వీళ్లద్దరి మధ్య విబేధాలకు చెక్ పడినట్లే అని అర్ధమైపోయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఒకేసారి 2-3 సినిమాలు చేసేస్తుండగా.. హేభా పటేల్ మాత్రం శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ మూవీ 'మిస్టర్' ప్రారంభం కోసం ఎదురుచూస్తోంది.