Begin typing your search above and press return to search.

ఠారెత్తిస్తున్న ఇస్మార్ట్ శంకర్ బేరం

By:  Tupaki Desk   |   1 March 2019 7:22 AM GMT
ఠారెత్తిస్తున్న ఇస్మార్ట్ శంకర్ బేరం
X
పూరి జగన్నాధ్ - రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' లాంచ్ రోజునుండే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూరి జగన్నాధ్ ఫామ్ లో లేకపోయినా సినిమా టైటిల్.. పక్కా లోకల్ హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కడం.. టాలెంటెడ్ హీరో రామ్ గెటప్ క్యారెక్టరైజేషన్ విభిన్నంగా కనిపిస్తుండడం తో సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. దీంతో రీసెంట్ గా 'ఇస్మార్ట్ శంకర్' మేకర్స్ ను శాటిలైట్ శాటిలైట్ రైట్స్ కోసం పలు ఛానల్స్ సంప్రదించాయట గానీ పూరి అండ్ టీం చెప్పే రేట్లకు వారికి మైండ్ బ్లాంక్ అయిందట.

'ఇస్మార్ట్ శంకర్' శాటిలైట్ రైట్స్ కు రూ. 10 కోట్లు రేటు చెప్పారట. ఇది మామూలు రేటు కాదు.. ప్రస్తుతం పూరి జగన్.. రామ్ లకు ఉన్న మార్కెట్ ను బట్టి చూస్తే ఇది చాలా ఎక్కువ. ఈమధ్య టాలీవుడ్ సినిమాల శాటిలైట్ రైట్స్ కు డిమాండ్ పెరగడంతో టీవీ ఛానల్స్ భారీ రెట్లు పెట్టి కొంటున్నారు. అందుకే నిర్మాతలు ఇస్మార్ట్ గా అలోచించి రేటెక్కువ చెప్తున్నారేమో కానీ టీవీ ఛానల్స్ వారు మాత్రం ఆ రేటు విని బెదిరిపోయారట. ఈ శాటిలైట్ రైట్స్ కే ఇంత చెప్తే.. ఇక డిజిటల్.. హిందీ డబ్బింగ్ రైట్స్ కు ఎంత చెప్తారో చూడాలి..

అసలు ఈ రేట్లు భారీగా చెప్పడం వెనక రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ ప్లానింగ్ ఉందని టాక్. ఈ సినిమాకు అయన నిర్మాత కాకపోయినా ఇస్మార్ట్ ఐడియా ఇచ్చింది ఆయనేనని టాక్ వినిపిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ ఇస్మార్ట్ బుట్టలో పడే ఆ జనాలెవరో..!