Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్ పోస్టర్.. ఇస్మార్ట్ గా ఉందిగా

By:  Tupaki Desk   |   2 July 2019 10:25 AM GMT
రిలీజ్ డేట్ పోస్టర్.. ఇస్మార్ట్ గా ఉందిగా
X
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. మొదట ఈ సినిమాను జులై 12 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు ఆ డేట్ మారిందనే సంగతి తెలిసిందే. ఒక వారం ఆలస్యంగా జులై 18 న రిలీజ్ చేస్తున్నారు. క్రికెట్ వరల్డ్ కప్ వల్ల కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో విడుదలను వారం పాటు వాయిదా వేశారని టాక్.

తాజాగా ఈ రిలీజ్ డేట్ ను కన్ఫాం చేస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రామ్ పక్కా మాస్ స్టైల్ లో సముద్రపు ఒడ్డున నిలబడి కాలర్ ఎగరేస్తూ ఒక కిరాక్ స్టెప్ వేస్తున్నాడు. అయితే రామ్ ఇంత కష్టమైన స్టెప్ లో కూడా ఏమాత్రం బీడీని వదలకపోవడం గమనార్హం. ఈలెక్కన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ముకేష్ యాడ్ నాలుగైదు సార్లు చూపిస్తారేమో మరి!

ఈ సినిమాలో నభ నటేష్.. నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యదేవ్.. పునీత్ ఇస్సార్.. ఆశిష్ విద్యార్ధి.. పవిత్రా లోకేష్.. బ్రహ్మానందం.. రావు రమేష్ ఈ సినిమాలో ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్.. ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.