Begin typing your search above and press return to search.

స్మార్ట్ గా డేట్ మార్చుకున్న శంకర్

By:  Tupaki Desk   |   22 Jun 2019 5:45 AM GMT
స్మార్ట్ గా డేట్ మార్చుకున్న శంకర్
X
ఎనర్జిటిక్ హీరో రామ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబోలో రూపొందుతున్న ఐస్మార్ట్ శంకర్ డేట్ మార్చుకుంది. తొలుత జూలై 12 ఫిక్స్ చేశారు. కాని ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జూలై 14న జరగనుంది. ఇండియా చూస్తేనేమో వరస విజయాలతో హాట్ ఫేవరేట్ గా మారిపోయి చివరి పోరు బరిలో ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా జనం మూడ్ ఆ ఫైనల్ మీదే ఉంటుంది.

అందుకే ఇదంతా ఆలోచించి ఐస్మార్ట్ శంకర్ డేట్ ని జూలై 18కి మార్చారు. అప్పటికి క్రికెట్ వేడి పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు సినిమాల మూడ్ లోకి వచ్చేస్తారు. సో ఒక్క వారం వాయిదాని రామ్ ఫాన్స్ పూరి అభిమానులు భరించాల్సిందే. ఇప్పటికే ఐస్మార్ట్ శంకర్ లో మూడు ఆడియో సింగిల్స్ రిలీజ్ అయ్యాయి. మణిశర్మ ఈజ్ బ్యాక్ అనేలా మ్యూజిక్ లవర్స్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడంతో యూనిట్ కూడా యమా హ్యాపీగా ఉంది.

పూరి మార్క్ హీరోయిజం ఆయన బ్రాండ్ మేకింగ్ ని ఇందులో చూడొచ్చని అభిమానులు సైతం చాలా ఆశలు పెట్టుకున్నారు. నిధి అగర్వాల్ నభా నటేష్ హీరొయిన్లు గా నటిస్తున్న ఈ మూవీలో రామ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఊహించని మలుపులతో పూరి స్టైల్ టేకింగ్ తో ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం టీంలో వ్యక్తమవుతోంది. మరి ఈ మసాలా విందును ఆరగించాలి అంటే జూలై 18 దాకా ఆగాల్సిందే