Begin typing your search above and press return to search.

5 థియేటర్లు 3 రోజులు.. ఫలితం ఉండేనా?

By:  Tupaki Desk   |   27 Sep 2019 1:30 AM GMT
5 థియేటర్లు 3 రోజులు.. ఫలితం ఉండేనా?
X
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ 'టెంపర్‌' చిత్రం తర్వాత ఎట్టకేలకు 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రంతో సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. రామ్‌ హీరోగా నిధి అగర్వాల్‌ మరియు నభా నటేష్‌ లు హీరోయిన్స్‌ గా నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. బయ్యర్లకు డబుల్‌ ప్రాఫిట్‌ ను ఈ చిత్రం రాబట్టింది. రెండు వారాల పాటు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసిన ఇస్మార్ట్‌ శంకర్‌ ఎవరూ ఊహించని వసూళ్లను రాబట్టి దర్శకుడిగా.. నిర్మాతగా పూరి ఫుల్‌ హ్యాపీ అయ్యేలా చేసింది.

ఇస్మార్ట్‌ శంకర్‌ మూడు.. నాలుగు వారాల తర్వాత పూర్తిగా థియేటర్ల నుండి వెళ్లి పోయింది. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో ఇస్మార్ట్‌ శంకర్‌ ను రీ రిలీజ్‌ చేయాలని పూరి భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అది నిజం చేస్తూ రేపు ఇస్మార్ట్‌ శంకర్‌ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 10 థియేటర్లలో రాబోతుంది. ప్రముఖ థియేటర్లలో ఇస్మార్ట్‌ షో పడబోతుంది. రేపు పెద్ద సినిమాలు ఏమీ విడుదల లేకపోవడం.. గత వారం అంతకు ముందు వారాలు విడుదలైన గద్దలకొండ మరియు గ్యాంగ్‌ లీడర్‌ లు కాస్త డల్‌ అయిన నేపథ్యంలో ఇస్మార్ట్‌ కలెక్షన్స్‌ నమోదవుతాయని పూరి భావిస్తున్నాడు.

ఈమద్య కాలంలో ఇలా రీ రిలీజ్‌ అవ్వడం మనం అస్సలు చూడటం లేదు. రీ రిలీజ్‌ వల్ల ప్రయోజనం ఉంటుందా అనేది ఈ చిత్రంతో తేలిపోనుంది. ఒక వేళ మంచి వసూళ్లు నమోదు అయితే మళ్లీ రీ రిలీజ్‌ లు మొదలయ్యే అవకాశం ఉంది. 27వ తారీకున విడుదల కాబోతున్న ఇస్మార్ట్‌ శంకర్‌ మూడు రోజుల పాటు అంటే 29వ తారీకు వరకు ప్రదర్శింపబడుతుంది. మూడు నాలుగు థియేటర్లలో సైరా వచ్చే వరకు కూడా ఉండే అవకాశం ఉంది. పాత పద్దతిని ఇస్మార్ట్‌ శంకర్‌ కొత్తగా ట్రై చేయబోతున్నాడు. మరి ఇది ఎంత వరకు ఫలితాన్ని ఇచ్చేనో చూడాలి.