Begin typing your search above and press return to search.

పూరి బ‌ర్త్ డేని ఇస్మార్ట్ డేగా ప్ర‌క‌టిస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   25 Sep 2019 9:48 AM GMT
పూరి బ‌ర్త్ డేని ఇస్మార్ట్ డేగా ప్ర‌క‌టిస్తార‌ట‌!
X
ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సెస్ త‌ర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మ‌రింత స్పీడ్ పెంచిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా స్టార్ హీరోల్ని ఖాతాలో వేసుకునేందుకు పూరి-ఛార్మి బృందం చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఇప్ప‌టికే రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కాల్షీట్లు ఖాయం చేసుకున్న పూరి త‌దుప‌రి ప్ర‌భాస్-కేజీఎఫ్ య‌శ్ లాంటి స్టార్ హీరోల‌తో మంత‌నాలు సాగిస్తున్నార‌ని వార్త‌లొచ్చాయి.

అయితే ఈనెల 28న పూరి జ‌గ‌న్నాథ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇంకేదైనా గుడ్ న్యూస్ చెబుతున్నారా? అని ప్ర‌శ్నిస్తే పూరి `కేవ్` వ‌ర్గాల నుంచి ఓ ఆస‌క్తిక‌ర సంగ‌తి రివీలైంది. పూరి బ‌ర్త్ డే ఈసారి మునుప‌టి కంటే చాలా స్పెష‌ల్ గా ఉండ‌బోతోందట‌. అలాగే కేవ్ మొత్తాన్ని మునుప‌టితో పోలిస్తే మ‌రింత ఇస్మార్ట్ గా ముస్తాబు చేసి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ కి ప్లాన్ చేస్తున్నార‌ట‌. పూరి బృందం మునుప‌టిలా లేరు. ఇప్పుడు అంతా ఇస్మార్ట్ గా రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. పూరి క‌నెక్ట్స్ టీమ్ లో అంతా ట్యాలెంటెడ్ గ‌య్స్ తో న‌వ‌న‌వ‌లాడుతోంద‌ట‌.

అంతేకాదు.. పూరి మ‌రో షాకింగ్ స‌ర్ ప్రైజ్ ని ఇవ్వ‌బోతున్నార‌ని తెలిసింది. త‌న‌ బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకుని ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాన్ని ఆరోజు థియేట‌ర్ల‌లో రీరిలీజ్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఒక ర‌కంగా ఏదైనా సినిమా థియేట‌ర్ల‌లో ఆడేసి వెళ్లిపోయాక‌.. ఈ డిజిట‌ల్ యుగంలో రీరిలీజ్ అంటే సాహ‌స‌మే. కానీ అందుకు ఎగ్జిబిట‌ర్ బృందాలు అంగీక‌రించాయ‌ని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంక‌ర్ డిజిట‌ల్ రైట్స్ ని ప్ర‌ముఖ తెలుగు ఎంట‌ర్ టైన్ మెంట్ చానెల్ చేజిక్కించుకుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. శాటిలైట్- డిజిట‌ల్ రైట్స్ కోసం స‌ద‌రు చానెల్ 14కోట్ల మేర చెల్లించింద‌ని ప్ర‌చార‌మైంది. ఓవైపు టీవీల్లో డిజిట‌ల్ వేదిక‌పై వ‌చ్చేస్తుంటే ఇలా రీరిలీజ్ చేస్తుండ‌డం స‌ర్ ప్రైజ్ అనే చెప్పాలి. అయితే ఇలా రిలీజ్ చేయ‌డం వ‌ల్ల ఇంత‌కుముందు చూడ‌ని వారు థియేట‌ర్ల‌లో వీక్షించే వీలుంటుంద‌న‌డంలో సందేహం లేదు.