Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ శంకర్ కు సెన్సార్ చిక్కులు ?

By:  Tupaki Desk   |   4 July 2019 5:59 AM GMT
ఇస్మార్ట్ శంకర్ కు సెన్సార్ చిక్కులు ?
X
నిన్న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ టోటల్ డిజిటల్ వ్యూస్ నాలుగు మిలియన్లు దాటిపోయి మాంచి జోరు మీదుంది. ఇంకో రెండు వారాల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో అంచనాలు అంతకంతా పెరుగుతున్నాయి. రామ్ పూరిల మొదటి కాంబినేషన్ కావడంతో అభిమానులు కూడా దీన్నుంచి చాలా ఆశిస్తున్నారు. అయితే ట్రైలర్ చూసాక రా కంటెంట్ తో పాటు డైలాగ్స్ కొన్ని బోల్డ్ గా ఉండటంతో సెన్సార్ పరంగా చిక్కులు ఏమైనా వచ్చే అవకాశం గురించి అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి.

నిజానికి గోవాలో సముద్రపు బ్యాక్ డ్రాప్ లో తీసిన పాటలలో తప్ప ఇంకెక్కడా ట్రైలర్ లో చూపించిన బోల్డ్ నెస్ ఉండదట. కథకు అనుగుణంగానే పూరి తన స్టైల్ లో వాటిని జొప్పించాడు తప్ప అసందర్భంగా రావనేది యూనిట్ మాట. ప్రాక్టికల్ గా చూస్తే సెన్సార్ నుంచి ఇస్మార్ట్ శంకర్ కు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కేవలం హాట్ సీన్ల ప్రాతిపాదికన సర్టిఫికేట్ ఇచ్చే పనైతే ఆరెక్స్ 100 లాంటి సినిమాలు ఇంకా పెద్ద ఇబ్బందులు ఎదురుకుని ఉండేవి.

ట్రైలర్ ని కట్ చేయడంలోనే ఊర మాస్ అప్పీల్ ని చూపించారు కాబట్టి డౌట్స్ వస్తున్నాయి కాని సినిమాలో కంటెంట్ వేరుగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. కెరీర్ లో మొదటిసారి ఊర మాస్ పాత్ర చేస్తున్న రామ్ రిజల్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. మణిశర్మ సంగీతం పూరి మార్క్ టేకింగ్ ఖచ్చితంగా హిట్ ఇస్తాయనే ధీమా కనిపిస్తోంది. ఒకవేళ సెన్సార్ ఒకటి రెండు కట్స్ చెప్పినా యువి సర్టిఫికేట్ తో ఈజీగా వచ్చేయొచ్చు. కాబట్టి ఫ్యాన్స్ ఇస్మార్ట్ శంకర్ గురించి టెన్షన్ పడాల్సింది ఏమి లేదు