Begin typing your search above and press return to search.
రెడ్ సినిమా రామ్ కి ఎంతో ప్రత్యేకం..దానికి ఇదే కారణం
By: Tupaki Desk | 21 Oct 2020 4:00 PM IST'ఇస్మార్ట్ శంకర్' సూపర్ హిట్ తో రామ్ జోరుమీద ఉన్నాడు. అదే జోరులో రెడ్ సినిమాను కూడా కంప్లీట్ చేశాడు. సినిమా వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా థియేటర్లు మూతపడి విడుదల ఆగిపోయింది. ఈ సినిమా తో పాటు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చాలా సినిమాలు థియేటర్లలో విడుదలకు అవకాశం లేకపోవడంతో ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు. కానీ రామ్ మాత్రం ఎంత లేట్ అయినా సరే ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాను తమిళ మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అయితే ఆ భాషల్లో అనుకున్నంత స్థాయిలో ఓటీటీ కి డీల్ కుదరక పోవడమూ ఓ కారణమే.ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయడానికి నిర్మాత స్రవంతి రవికిషోర్ సన్నాహాలు చేస్తున్నారు.
మలయాళంలో తెలుగు హీరోలకు మంచి ఆదరణ దక్కుతుండడంతో మలయాళ వెర్షన్ కి రామ్ డబ్బింగ్ చెప్పారట.రామ్ -కిశోర్ తిరుమల కాంబినేషన్ లో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు ఇదివరకే రాగా ఇది వారిద్దరికీ హ్యాట్రిక్ మూవీ. ఈ రెండు సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్లు అక్కడ జనాలకు విపరీతంగా నచ్చడంతో ఈసారి కూడా తమ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని రామ్ భావిస్తున్నారు. కాగా రెడ్ సినిమాకు రామ్ కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సినిమా కోసం రామ్ మొదటి సారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రెండు పాత్రలకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కాగా అభిమానులకు, ప్రేక్షకులకు బాగా నచ్చాయి. రామ్ మొదటి సారి రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాకు అటు ప్రేక్షకుల్లో, ట్రేడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.